తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ashok Gehlot Viral Statement| సోనియాతో భేటీ అనంతరం అశోక్ గహ్లోత్ సంచలన ప్రకటన

Ashok Gehlot viral statement| సోనియాతో భేటీ అనంతరం అశోక్ గహ్లోత్ సంచలన ప్రకటన

HT Telugu Desk HT Telugu

29 September 2022, 15:20 IST

    • Ashok Gehlot viral statement| కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ గురువారం ప్రకటించారు. 
రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ (ఫైల్ ఫొటో)
రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ (ఫైల్ ఫొటో)

రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ (ఫైల్ ఫొటో)

Ashok Gehlot viral statement| కాంగ్రెస్ పార్టీ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజస్తాన్ లో ఇటీవల జరిగిన క్రమశిక్షణ రాహిత్య చర్యల పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరులో ముందంజలో ఉన్న రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్.. ఆ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.

Ashok Gehlot viral statement| సోనియాతో భేటీ..

గురువారం ఢిల్లీలో పార్టీ చీఫ్ సోనియా గాంధీతో అశోక్ గహ్లోత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజస్తాన్ లో ఇటీవల జరిగిన పరిణామాలపై సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయగా, అశోక్ గహ్లోత్ ఆమెకు వివరణ ఇవ్వడంతో పాటు క్షమాపణలు కోరారు. ఈ భేటీ అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కొచ్చిలో రాహుల్ గాంధీని కలిసి, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తనను కోరానని వెల్లడించారు.

Ashok Gehlot viral statement| రాజస్తాన్ సీఎం?

రాజస్తాన్ సీఎం గా తాను కొనసాగడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఎవరు ఉండాలనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. రాజస్తాన్ లో ఇటీవల ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ విషయంలో సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పానని, ఆ వ్యవహారమంతా తాను సీఎంగా కొనసాగడం కోసం చేసినట్లుగా ప్రచారం జరిగిందని గహ్లోత్ వివరించారు.

Ashok Gehlot viral statement| ముగ్గురిపై వేటు?

రాజస్తాన్ లో అశోక్ గహ్లోత్ కు సన్నిహితులైన ముగ్గురికి పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక, క్రమశిక్షణ రాహిత్య చర్యలకు పాల్పడిన ఆరోపణలపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన శాంతి ధరీవాల్, మహేశ్ జోషి, ధర్మేంద్ర రాథోడ్ లకు షో కాజ్ నోటీసులను జారీ చేసింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.