తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Army Assault Dog Zoom Dies: సాహస శునకం ‘జూమ్’ కన్నుమూత

Army assault dog Zoom dies: సాహస శునకం ‘జూమ్’ కన్నుమూత

HT Telugu Desk HT Telugu

13 October 2022, 20:36 IST

  • Army assault dog Zoom dies: ఆర్మీ డాగ్ జూమ్ గురువారం మధ్యాహ్నం కన్నుమూసింది. ఇటీవల ఉగ్రవాదులను ఏరివేసే ఒక ఆపరేషన్ లో పాల్గొన్న సందర్భంగా ఆ కుక్కకు బుల్లెట్ గాయాలయ్యాయి.

సాహస శునకం ‘జూమ్’
సాహస శునకం ‘జూమ్’

సాహస శునకం ‘జూమ్’

జూమ్.. ఆర్మీ అసాల్ట్ డాగ్.. సైనిక దళాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న, శిక్షణ పొందిన సాహన శునకం. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా సోమవారం గాయపడింది.

Army assault dog Zoom dies: ఇద్దరు టెర్రరిస్టులు హతం..

జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉన్న కొకెర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సోమవారం భద్రతాబలగాలు అక్కడికి చేరుకున్నాయి. వారితో పాటు శిక్షణ పొందిన శునకం జూమ్ కూడా ఆ ఆపరేషన్ లో పాల్గొంది. ఆ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు సైనికులతో పాటు జూమ్ కూడా తీవ్రంగా గాయపడింది.

Army assault dog Zoom dies: చికిత్స..

వెంటనే ఆ శునకాన్ని శ్రీనగర్ లోని ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గురువారం మధ్యాహ్నం వరకు కొద్దిగా కోలుకున్నట్లు కనిపించిన జూమ్.. ఆ తరువాత పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది.

Army assault dog Zoom dies: నెటిజన్ల సంతాపం

భారతీయ సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ట్వటర్ లో జూమ్ గాయపడిన విషయాన్ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. జూమ్ త్వరగా కోలుకోవాలని వేలల్లో సందేశాలు వచ్చాయి. గురువారం ఆ సాహస శునకం చనిపోయిన తరువాత కూడా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. RIPZoom హ్యాష్ ట్యాగ్ తో సాహస శునకానికి నివాళులర్పించారు.