తెలుగు న్యూస్  /  National International  /  Applications Process Underway For 300 Assistant Manager Posts In Ntpc

NTPC Recruitment: ఎన్‍టీపీసీలో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: వివరాలివే

24 May 2023, 13:10 IST

    • NTPC Recruitment: ఎన్‍టీసీపీలో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 2 ఆఖరు తేదీగా ఉంది.
NTPC Recruitment: ఎన్‍టీపీసీలో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: వివరాలివే
NTPC Recruitment: ఎన్‍టీపీసీలో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: వివరాలివే

NTPC Recruitment: ఎన్‍టీపీసీలో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: వివరాలివే

NTPC Recruitment 2023: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC).. 300 అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్/మెయింటెనెన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు careers.ntpc.co.in వెబ్‍సైట్‍లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‍లైన్‍లో దరఖాస్తులు సమర్పించేందుకు జూన్ 2 ఆఖరు తేదీగా ఉంది. వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

పోస్టుల వివరాలు

NTPC Recruitment 2023: మొత్తంగా వివిధ విభాగాల్లో 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

  • ఎలక్ట్రికల్ విభాగంలో - 120 పోస్టులు
  • మెకానికల్ విభాగంలో - 120 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్/ఇన్‍స్ట్రుమెంటేషన్ విభాగంలో - 60 పోస్టులు

నోటిఫికేషన్ ప్రకారం మే 19న ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. జూన్ 2వ తేదీ అప్లికేషన్లకు ఆఖరు గడువుగా ఉంది.

విద్యార్హత, వయోపరిమితి

NTPC Recruitment 2023: ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్, ఇన్‍స్ట్రుమెంటేషన్ / పవర్ ఎలక్ట్రిక్ కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులతో బీ.టెక్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. పోస్టును బట్టి విద్యార్హత ఉంది. అందుకే అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‍ను క్షుణ్ణంగా పరిశీలించాలి. careers.ntpc.co.in వెబ్‍సైట్‍లో నోటిఫికేషన్ ఉంటుంది.

NTPC Recruitment 2023: ఈ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. ఎస్‍సీ, ఎస్‍టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. మరికొన్ని కేటగిరీలకు కూడా వయోపరిమితి మినహాయింపు ఉంది. విద్యార్హత, వయోపరిమితి, రిజర్వేషన్లు, పే స్కేల్ పూర్తి వివరాల కోసం అభ్యర్థులు.. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‍ను పూర్తిగా పరిశీలించాలి.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా ఆన్‍లైన్ పరీక్షకు హాజరు కావాల్సిఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టు ఉంటుంది.

దరఖాస్తు చేయండిలా..

  • ముందుగా careers.ntpc.co.in వెబ్‍సైట్‍లోకి వెళ్లండి.
  • హోంపేజీలో నోటీస్ బోర్డు సెక్షన్‍లో అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్/మెయింటెనెన్స్) Advt 10/23 అని కనిపిస్తుంది.
  • అక్కడే అప్లై బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఇంతకు ముందు ఎన్‍టీపీసీలో రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అవండి. లేకపోతే వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
  • అనంతరం దరఖాస్తులో వివరాలు ఎంటర్ చేసి చివరగా సబ్మిట్‍ బటన్‍పై క్లిక్ చేయాలి.
  • చివరగా అప్లికేషన్‍ను ప్రింటౌట్ తీసుకోవాలి.