తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aaftab's New Girl Friend In A Shocked State: షాక్ లో ఆఫ్తాబ్ కొత్త గర్ల్ ఫ్రెండ్

Aaftab's new girl friend in a shocked state: షాక్ లో ఆఫ్తాబ్ కొత్త గర్ల్ ఫ్రెండ్

HT Telugu Desk HT Telugu

30 November 2022, 23:20 IST

  • Aaftab's new girl friend: లివిన్ పార్ట్ నర్ శ్రద్ధ వాకర్ ను దారుణంగా హతమార్చి, శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని ఫ్రిజ్ లో దాచి,  బయట మాత్రం అత్యంత నార్మల్ గా బిహేవ్ చేసిన ఆఫ్తాబ్ లీలలు మరిన్ని బయటకు వస్తున్నాయి.

ఆఫ్తాబ్ అమిన్ పూనావాలా(ఫైల్ ఫోటో)
ఆఫ్తాబ్ అమిన్ పూనావాలా(ఫైల్ ఫోటో)

ఆఫ్తాబ్ అమిన్ పూనావాలా(ఫైల్ ఫోటో)

Aaftab's new girl friend in a shocked state: శ్రద్ధ వాకర్ ను హత్య చేసిన అనంతరం, ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి, ఫ్రిజ్ లో దాచి పెట్టిన ఆఫ్తాబ్.. ఆ శరీర భాగాలు ఫ్రిజ్ లో ఉండగానే, మరో యువతితో డేటింగ్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

Aaftab's dating apps: డేటింగ్ యాప్స్ సాయంతో..

ఆఫ్తాబ్ టిండర్ వంటి డేటింగ్ యాప్స్ ను వాడుకుని యువతులను పరిచయం చేసుకునే వాడు. శ్రద్ధ వాకర్ కూడా తనకు అలాగే పరిచయం అయింది. శ్రద్ధను హత్య చేసిన తరువాత మళ్లీ కొంతమంది యువతులతో కాంటాక్ట్ అయ్యాడు. వారిలో ఒక సైకియాట్రిస్ట్ కు దగ్గరయ్యాడు. ఆమెను తమ ఫ్లాట్ కు కూడా తీసుకువెళ్లాడు. ఆ సమయంలో ఆ ఫ్లాట్ లోని ఫ్రిజ్ లో శ్రద్ధ శరీర భాగాలు ఉన్నాయి.

Aaftab's new girl friend in a shocked state: షాక్ లో ఆ యువతి

పోలీసులు డేటింగ్ యాప్ సాయంతో ఆ సైకియాట్రిస్ట్ వివరాలు తెలుసుకుని ఆమెను ప్రశ్నించారు. జరిగిన విషయం తెలుసుకున్న తరువాత తాను షాక్ కు గురయ్యానని, ప్రస్తుతం కౌన్సెలింగ్ తీసుకుంటున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. ఆఫ్తాబ్ లో హత్య చేశానన్న భయం కానీ ఆందోళన కానీ కనిపించలేదని, చాలా సాధారణంగా బిహేవ్ చేసేవాడని వివరించింది. చాలా ప్రేమగా, కేరింగ్ గా ఉండేవాడని తెలిపింది.

Shraddha's ring gifted to new girl friend: కొత్త గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా శ్రద్ధ రింగ్

శ్రద్ధ ను హత్య చేసిన తరువాత ఆమె రింగ్ ను ఆఫ్తాబ్ గిఫ్ట్ గా ఇచ్చాడని ఆ యువతి వెల్లడించింది. షాప్ లో కొన్నానని, గిఫ్ట్ ప్యాక్ లో ఇచ్చాడని తెలిపింది. ఆఫ్తాబ్ ప్రవర్తన తనకు అనుమానాస్పదంగా కనిపించలేదని వివరించింది. శ్రద్ధ హత్యలో తన పాత్ర లేదని, శ్రద్ధతో ఆఫ్తాబ్ రిలేషన్ విషయం ఆమె హత్య విషయం బయటకు వెల్లడైన తరువాతనే తనకు తెలిసిందని వివరించింది.

Aaftab habits: సిగరెట్స్, పెర్ఫ్యూమ్స్ చాలా ఇష్టం..

ఆఫ్తాబ్ కు పెర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టమని, తన ఫ్లాట్ లో అవి చాలా ఉన్నాయని వెల్లడించింది. తనకు కూడా కొన్ని పెర్ఫ్యూమ్స్ ను గిఫ్ట్స్ గా ఇచ్చాడని తెలిపింది. అలాగే, నాన్ వెజ్ చాలా ఇష్టంగా తినేవాడని, తన ఫ్లాట్ కు వివిధ రెస్టారెంట్ల నుంచి నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకునేవాడని వివరించింది. ఆఫ్తాబ్ చైన్ స్మోకర్ అని, సిగరెట్లను తనే చుట్టుకునేవాడని వెల్లడించింది.

టాపిక్