తెలుగు న్యూస్  /  National International  /  7 Dead, Several Feared Missed After Flash Floods Hit Mal River In Wb's Jalpaiguri During Idol Immersion

Jalpaiguri flash floods : ఆకస్మిక వరదలతో పశ్చిమ్​ బెంగాల్​లో ఏడుగురు మృతి!

Sharath Chitturi HT Telugu

06 October 2022, 6:37 IST

  • Jalpaiguri flash floods death toll : పశ్చిమ్​ బెంగాల్​లో దసరా వేళ తీవ్ర విషాదం నెలకొంది. మాల్​ నదిని ఆకస్మిక వరదలు ముంచ్చెత్తాయి. విగ్రహాల నిమజ్జనానికి వెళ్లిన అనేకమంది వరదల్లో కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు.

ఆకస్మిక వరదలతో పశ్చిమ్​ బెంగాల్​లో ఏడుగురు మృతి!
ఆకస్మిక వరదలతో పశ్చిమ్​ బెంగాల్​లో ఏడుగురు మృతి!

ఆకస్మిక వరదలతో పశ్చిమ్​ బెంగాల్​లో ఏడుగురు మృతి!

West Bengal flash floods : భారీ వర్షాలు కురుస్తున్న పశ్చిమ్​ బెంగాల్​లోని జల్​పైగురి ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచ్చెత్తాయి. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం మాల్​ నదీ ప్రాంతానికి భక్తులు వెళ్లగా.. ఒక్కసారిగా వరదల్లో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

"దేవీ విగ్రహ నిమజ్జనం సమయంలో మాల్​ నదిని ఒక్కసారిగా ఆకస్మిక వరదలు ముంచ్చెత్తాయి. అనేక మంది నదిలో చిక్కుకుపోయారు. మరికొందరు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 7 మృతదేహాలను వెలికి తీశాము. ఎన్​డీఆర్​ఎఫ్​, సివిల్​ డిఫెన్స్​ సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారు," అని జల్​పైగురి ఎస్​పీ దేబార్షి దత్త మీడియాకు చెప్పారు.

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"పశ్చిమ్​ బెంగాల్​ జల్​పైగురిలో దుర్గా పూజ వేళ జరిగిన విషాదంతో బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి," అని ట్వీట్​ చేశారు మోదీ.