5 door Mahindra Thar : 5 డోర్ మహీంద్రా థార్ వచ్చేస్తోంది..!
12 September 2022, 15:18 IST
- 5 door Mahindra Thar : మహీంద్రా థార్‌లో 5 డోర్ వేరియంట్ త్వరలో లాంచ్ కానుంది! ఈ మోడల్‌పై ఉన్న అంచనాలను ఇక్కడ తెలుసుకోండి.
5 డోర్ మహీంద్రా థార్ వచ్చేస్తోంది..!
Mahindra Thar 5 door model : ఎలక్ట్రిక్ వాహనాలు, ఎస్‌యూవీలతో జోరు మీద ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రాకు సంబంధించి.. ఇప్పుడు మరో వార్త బయటకొచ్చింది. మహీంద్రా థార్‌కు సంబంధించిన కొత్త మోడల్‌ను లాంచ్ చేసేందుకు ఎం అండ్ ఎం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ కొత్త మహీంద్రా థార్.. 5 డోర్ వేరియంట్ అని సమాచారం.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా థార్ 5 డోర్ మోడల్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది. ఇదే ఎక్స్‌పోలో మారుతీ సుజుకి జిమ్ని 5 డోర్ మోడల్, ఫోర్స్ గూర్ఖ 5 డోర్ మోడళ్లు కూడా ప్రదర్శనకు వస్తాయని అంచనాలు ఉన్నాయి.
ఇక ప్రస్తుతం ఉన్న మహీంద్రా థార్‌లో 3 డోర్ మోడల్స్ ఉన్నాయి. ఇక మహీంద్రా థార్ 5 డోర్ మోడల్లో భారీ వీల్ బేస్ ఉంటుందని తెలుస్తోంది. టెయిల్ లైట్‌తో పాటు రేర్‌లో స్పేర్ వీల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్.. రెక్టాంగ్యులర్ షేప్‌లో ఉండొచ్చు. ఇక మహీంద్రా థార్ 5 డోర్ లోపలి భాగంలో స్పేస్ ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
5 door Mahindra Thar model : 3 డోర్ మోడల్ కన్నా.. 5 డోర్ మహీంద్రా థార్‌లో మరింత స్టెబులిటీ ఉంటుందని మార్కెట్ నుంచి అంచనాలు వెలువడుతున్నాయి. 3 డోర్ మహీంద్రా థార్.. 4 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక 5 డోర్ మహీంద్రా థార్ మోడల్ 4.3మీటర్ల పొడవు ఉండొచ్చు. స్కార్పియో ఎన్ 4.7 మీటర్ల పొడవు ఉంది.
మహీంద్రా థార్ 5 డోర్ మోడల్లో 2.2లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్, 2 లీటర్ ఎంస్టాలియన్ పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ..
Mahindra XUV400 EV latest news : ఇటీవలే ఎక్స్‌యూవీ400 ఈవీని మార్కెట్లోకి లాంచ్ చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌కు ఇది గట్టి పోటీగా నిలుస్తోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ మోడల్‌కి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.