తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  4 Terrorists Killed: భారీగా ఆయుధాలతో భారత్ లోకి; మట్టుబెట్టిన ఆర్మీ

4 terrorists killed: భారీగా ఆయుధాలతో భారత్ లోకి; మట్టుబెట్టిన ఆర్మీ

HT Telugu Desk HT Telugu

28 December 2022, 17:10 IST

  • Major encounter in Jammu: పాకిస్తాన్ నుంచి భారత్ లోకి విజయవంతంగా చొరబడి, జమ్మూ నుంచి ఒక ట్రక్ లో కశ్మీర్ కు వెళ్తున్న నలుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

ఎన్ కౌంటర్ అనంతరం స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో భద్రత బలగాలు
ఎన్ కౌంటర్ అనంతరం స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో భద్రత బలగాలు (PTI)

ఎన్ కౌంటర్ అనంతరం స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో భద్రత బలగాలు

Major encounter in Jammu: భారీ ఉగ్రదాడిని భారత సైన్యం అనుకోకుండా, అడ్డుకుంది. భారీగా ఆయుధాలతో భారత్ లో విధ్వంసం సృష్టించడానికి పాక్ నుంచి వచ్చిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చింది.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Major encounter in Jammu: రిపబ్లిక్ డే ముందు..

భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కశ్మీర్లో ఉగ్రదాడులకు అవకాశమున్న నేపథ్యంలో.. భారీగా ఆయుధాలతో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వడం శుభపరిణామమని భావిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ హైవే పై సిధ్ర బై పాస్ కు దగ్గరలో తావి బ్రిడ్జ్ వద్ద బుధవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రత బలగాలు జమ్మూ నుంచి కశ్మీర్ వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న ట్రక్ ను వెంబడించి, తావి బ్రిడ్జ్ వద్ద ఆ ట్రక్ ను అడ్డుకున్నారు. ఈ లోపు వారిపై ట్రక్ లోపలి నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. దాంతో, అప్రమత్తమైన భద్రత బలగాలు, ఎదురుకాల్పులు జరిపాయి. దాదాపు గంట పాటు ఈ ఎన్ కౌంటర్ కొనసాగింది. ఈ లోపు ట్రక్ డ్రైవర్ తప్పించుకున్నాడు. ఎన్ కౌంటర్ ముగిసిన తరువాత ట్రక్ లోపల నాలుగు మృతదేహాలను భద్రత బలగాలు గుర్తించాయి.

4 terrorists killed: భారీగా ఆయుధాలు

మృతదేహాలతో పాటు ట్రక్ లోపల, ఏడు ఏకే రైఫిల్స్(AK assault rifles)ను, ఒక ఆధునిక ఎం 4 రైఫిల్(M4 rifle) ను, మూడు పిస్టల్స్(pistols) ను, పెద్ద ఎత్తున మందుగుండు ను స్వాధీనం చేసుకున్నారు. ఆధునిక ఎం 4 రైఫిల్ ఉండడాన్ని గమనిస్తే, హతమైన ఉగ్రవాదుల్లో కమాండర్ స్థాయి టెర్రరిస్ట్ ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ ఉగ్రవాదులు ఎవరు? ఏ సంస్థకు చెందినవారు?, ఏ మిషన్ పై కవ్మీర్ కు వెళ్తున్నారు? అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నామని జమ్మూజోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ వెల్లడించారు. జమ్మూ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇదన్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్ లో పెద్ద ఎత్తున ఆయుధాలతో ఒక ట్రక్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్న అనంతరం, నిఘా పెంచామని వివరించారు. ఈ సీజన్ లో పాక నుంచి చొరబాట్లకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.