తెలుగు న్యూస్  /  National International  /  26 Percent Of World Lacks Clean Drinking Water, 46% Sanitation: Un Report

UN report on drinking water : 'ప్రపంచంలో 26శాతం మందికి తాగునీరే అందడం లేదు'

Sharath Chitturi HT Telugu

22 March 2023, 9:38 IST

  • UN report on drinking water : ప్రపంచంలో 26శాతం మందికి తాగునీరు అందడం లేదని యూఎన్​ నివేదిక పేర్కొంది. పరిస్థితులను మెరుగుపరిచేందుకు వెంటనే కృషి చేయాలని తెలిపింది.

'ప్రపంచంలో 26శాతం మందికి తాగునీరే అందడం లేదు'
'ప్రపంచంలో 26శాతం మందికి తాగునీరే అందడం లేదు'

'ప్రపంచంలో 26శాతం మందికి తాగునీరే అందడం లేదు'

UN Report On Water Shortages : ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్​ జనాభాకు సురక్షితమైన తాగునీరు అందడం లేదని, 3.6 బిలియన్​ మంది పారిశుద్ధ్యానికి దూరంగా జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో తేలింది. తాగునీటి మితిమీరిన వినియోగం, వాతావరణ మార్పులు ఇందుకు కారణం అని నివేదిక పేర్కొంది. మరీ ముఖ్యంగా.. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో పరిస్థితుల మరింత దారుణంగా మారుతాయని, నీటి కొరత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

‘మేలుకోకపోతే.. ఇక అంతే!’

దాదాపు 45ఏళ్ల తర్వాత.. తాగునీరు అంశంపై యూఎన్​ కాన్ఫరెన్స్​ జరిగింది. న్యూయార్క్​ వేదికగా మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముందు తాగునీరు, పారిశుద్ధ్యంపై.. యూఎన్​ వాటర్​ ఫారమ్​, యూఎన్​స్కో సంయుక్తంగా "యూఎన్​వరల్డ్​ వాటర్ డెవెలప్​మెంట్​ రిపోర్ట్​ 2023​" అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేశాయి. ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయని నివేదిక వెల్లడించింది.

Drinking water shortage in the world : నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన రీచర్డ్​ కానర్​ సైతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

"ప్రపంచంలో 2 బిలియన్​ మందికి మంచి తాగునీరు అందడం లేదు. ఇది దాదాపు 26శాతం. 46శాతం మందికి పారిశుద్ధ్య సదుపాయాలు సైతం అందడం లేదు. పరిస్థితులను మెరుగుపరిచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి. తాగునీరు, పారిశుద్ధ్య విషయాలో మన లక్ష్యాలను సాధించుకునేందుకు ప్రతియేటా.. 600 బిలియన్​ డాలర్ల నుంచి 1 ట్రిలియన్​ డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే.. డబ్బు ఖర్చు చేయడం ఒక్కటే ముఖ్యం కాదు. పెట్టుబడిదారులు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వాలు, వాతావరణ మార్పును అడ్డుకునేందుకు కృషిచేస్తున్న సంఘాల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం కూడా కీలకమే," అని రీచర్డ్​ అన్నారు.

Water shortage in India : నివేదిక ప్రకారం.. 40ఏళ్లుగా.. తాగునీటి వినియోగం ప్రతియేటా 1శాతం చొప్పున పెరుగుతోంది. 2050 వరకు ఇదే విధంగా పెరిగే అవకాశం ఉంది. జనాభా పెరుగుదల, సామాజిక- ఆర్థిక అభివృద్ధి, నీటి వినియోగంలో మార్పులు వంటివి ఇందుకు కారణం. పారిశ్రామిక వృద్ధి, నగరాల్లో జనాభా పెరుగుదలతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నీటి వినియోగం అధికంగా ఉంటోంది. ప్రపంచంలోని 10శాతం జనాభా.. తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉన్న దేశాల్లో నివాసముంటోంది.

"ప్రపంచం.. ప్రమాదకరమైన మార్గంలో గుడ్డిగా ప్రయాణిస్తోంది," అని.. ఈ నివేదికను ఉదాహరణగా చూపిస్తూ యూఎన్​ జనరల్​ సెక్రటరీ అంటోనియో గుటెర్రస్​ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాధినేతలు ఇప్పటికైనా మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.