తెలుగు న్యూస్  /  National International  /  2,400kg Ganja Tucked In Drums Seized Along Assam-tripura Border, 2 Held

Ganja seized in Assam border : సరిహద్దులో 2,400 కేజీల గంజాయి పట్టివేత

Sharath Chitturi HT Telugu

16 October 2022, 15:34 IST

  • Ganja seized in Assam border : అసోం- త్రిపుర సరిహద్దులో 2,400 కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

అసోం సరిహద్దుల్లో గంజాయి పట్టివేత
అసోం సరిహద్దుల్లో గంజాయి పట్టివేత (@himantabiswa)

అసోం సరిహద్దుల్లో గంజాయి పట్టివేత

Ganja seized in Assam border : అసోం- త్రిపుర సరిహద్దులో భారీ మొత్తంలో నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు బీఎస్​ఎఫ్​ (బార్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​) అధికారులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

2,400 కేజీల గంజాయిని డ్రమ్ముల్లో పెట్టి తరలిస్తుండగా.. చౌరైబరి వాచ్​పోస్ట్​ వద్ద బీఎస్​ఎఫ్​ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.

నిషేధిత పదార్థాలు..

అసోంలో ఇటీవలి కాలంలో భారీ మొత్తంలో నిషేధిత పదార్థాలు పట్టుబడుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే కరీంగంజ్​ జిల్లాలో 9.47కేజీల హెరాయిన్​ని అధికారులు జప్తు చేశారు. మిజోరాం నుంచి త్రిపురకు వెళుతున్న వాహనంలో నుంచి ఈ హెరాయిన్​ని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్​ చేశారు.

గత నెలలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. చచర్​ జిల్లాలో 4లక్షల యాబా ట్యాబ్లెట్లను అధికారులు పట్టున్నారు. ఏడుగురు మణిపూర్​వాసులను అసోం సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

దశాబ్దాలుగా.. నార్కోటిక్స్​ తరలింపునకు అసోం సరిహద్దులు అడ్డాగా ఉండేవి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ సైతం అంగీకరించారు. అయితే.. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని, అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కొన్ని రోజుల క్రితమే ఆయన వెల్లడించారు.

2016లో 10కేజీలు​, 2017లో 5కేజీలు, 2018లో 7కేజీలు, 2019లో 23కేజీలు, 2020లో 27కేజీల హెరాయిన్​ను పట్టుకున్నట్టు అధికారిక లెక్కల్లో ఉన్నాయి.

"ఈ లెక్కలు చూస్తుంటే.. డ్రగ్స్​ ఎక్కువగా ఉన్నాయి, పట్టుకుంటున్నవి తక్కువగా ఉంటున్నాయని అర్థమవుతోంది. నేను సీఎం పదవి చేపట్టిన తర్వాత ఈ విషయంపై దృష్టిపెట్టాను. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో ప్రత్యేకంగా మాట్లాడాను. ఇలాంటి అంశాలను తేలికగా వదలకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నాము," అని శర్మ వెల్లడించారు.

ఒక్క అసోంలోనే కాదు. దేశవ్యాప్తంగా గంజాయి, హెరాయిన్​ అక్రమ రవాణాలు జరుగుతున్నాయి. గుజరాత్​, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో హెరాయిన్​ను తరలిస్తున్న ఓడలను అధికారులు జప్తు చేస్తూనే ఉన్నారు.