తెలుగు న్యూస్  /  National International  /  2 Terrorists Killed In Shopian Encounter In Jammu And Kashmir

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

HT Telugu Desk HT Telugu

15 June 2022, 8:36 IST

    • కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్ లో వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. 
జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్(ప్రతీతాత్మక చిత్రం)
జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్(ప్రతీతాత్మక చిత్రం) (ANI)

జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్(ప్రతీతాత్మక చిత్రం)

జమ్మూకశ్మీరులో బుధవారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో  నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లా కంజియులర్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఒకరిని జాన్ అహ్మద్ లోన్‌గా గుర్తించారు.  భద్రతా బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.

ట్రెండింగ్ వార్తలు

Canada working hours: విదేశీ విద్యార్థులకు కెనడా షాక్; ఇక వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్

Kota suicide: ‘‘సారీ నాన్నా.. ఈ సారి కూడా సాధించలేకపోయా’’ - కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

Stabbings in London: లండన్ లో కత్తితో దుండగుడి వీరంగం; పలువురికి గాయాలు

Chhattisgarh encounter: మావోలకు మరో ఎదురు దెబ్బ; ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి

ఆ కేసులో నిందితుడు...

ఈ ఎన్ కౌంటర్ లో హతమైన జాన్ మహ్మద్ జూన్ 2వ తేదీన కుల్గాం జిల్లాలో బ్యాంకు మేనేజరు విజయ్ కుమార్ ను హతమార్చిన కేసులో నిందితిడిగా ఉన్నట్లు కశ్మీర్ జోన్ పోలీసు ట్వీట్ చేసింది. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందని పేర్కొంది.

జూన్ 12వ తేదీన పుల్వామా లోని వేర్వురు ప్రాంతాల్లో జరిగిన ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఈ ఎన్ కౌంటర్ లో కూడా నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఉగ్రవాదుల్లో ఒకరి పేరును జునైద్ షీర్గోజ్రీగా అధికారులు గుర్తించారు. మే13 వ తేదీన భద్రతా సిబ్బంది రియాజ్ అహ్మద్ ను హతం చేసిన ఘటనలో ఇతనికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

 

టాపిక్