తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sex Conversations | సెక్స్ ముందు, తర్వాత మీ పార్టనర్​తో మాట్లాడాల్సిందేనా..

Sex Conversations | సెక్స్ ముందు, తర్వాత మీ పార్టనర్​తో మాట్లాడాల్సిందేనా..

HT Telugu Desk HT Telugu

31 March 2022, 10:48 IST

    • సెక్స్‌కు ముందు సంభాషణలు ఉద్రేకం కలిగిస్తాయని అందరికీ తెలుసు. అయితే సెక్స్ తర్వాత సంభాషణలు మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయంటున్నారు నిపుణులు. బెడ్​ రూమ్​లో సంభాషణలు.. మీ సంబంధాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయని సూచిస్తున్నారు. శృంగారానికి ముందు, తర్వాత సరైన సంభాషణలు జరగడం చాలా ముఖ్యమంటున్నారు సెక్స్ ఎడ్యుకేటర్ సీమా ఆనంద్. మరి ఆ సంభాషణలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సెక్స్ సంభాషణలు
సెక్స్ సంభాషణలు

సెక్స్ సంభాషణలు

Sex Conversations | బలమైన లైంగిక సంభాషణను కలిగి ఉన్న జంటలు.. వారి లైంగిక జీవితాలతో మరింత సంతృప్తి చెందుతారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మరింత బహిరంగ సంభాషణతో, సాన్నిహిత్యం, బలమైన సంబంధం పెరుగుతుందని వెల్లడిస్తున్నాయి. కొత్త విషయాలను ప్రయత్నించాలనే కోరికల విషయంలో కూడా ఈ సంభాషణలే కీలకం అంటున్నారు నిపుణలు. సెక్స్‌కు ముందు సంభాషణలు గాసిప్‌గా, కొంటెగా ఉండాలని.. సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

River Rafting: మీకు రివర్ రాఫ్టింగ్ చేయడం ఇష్టమా? అయితే మన దేశంలో ఈ నదీ ప్రాంతాలకు వెళ్ళండి

New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Spicy Chutney: వేడివేడి అన్నంలోకి ఇలా స్పైసీగా పుదీనా టమోటో చట్నీ చేసుకోండి, ఎంత అన్నమైనా తినేస్తారు

సెక్స్ సంభాషణలు

సెక్స్ అనేది చాలా భావోద్వేగాలను బయటకు తీసుకొచ్చే చర్య. ఇది కౌగిలించుకోవడం, మసాజ్ చేయడం, ముద్దు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా మరిన్నింటిని కలిగి ఉంటుంది.“సెక్స్ తర్వాత ఇది సంతోషకరమైన, అందమైన, ప్రశాంతమైన సంభాషణలకు సంబంధించినదిగా ఉండాలి. శరీరాన్ని తిరిగి నియంత్రిత స్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం కాబట్టి.. లైంగిక సంరక్షణ అనేది మంచి పద్ధతి.

చేయకూడని పనులు

సెక్స్ తర్వాత మీ భాగస్వామి పనితీరును విమర్శించకుండా ఉండటం చాలా ముఖ్యం. మీరు చేయకూడని ఇతర విషయం ఏమిటంటే.. వారి శరీరాలపై, ఆకృతిపై వ్యాఖ్యానించడం. ఎందుకంటే వారు మీతో సన్నిహిత క్షణాన్ని పంచుకున్నారు కాబట్టి. అలాగే, మీ ఇద్దరి మధ్య వివాదానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడం మంచి ఆలోచన... అని మీరు భావిస్తే, వెంటనే దాన్ని ఆపండి. ఆ క్షణంలో అలాంటి సబ్జెక్ట్‌లను తీసుకురాకపోవడమే మంచిది. ఆ సంభాషణలను సాధారణ సమయాల కోసం వదిలివేయండి. ఆ సమయంలో వారిని కౌగిలించుకుని ఆ సమయాన్ని ఆస్వాదించండి.

అసౌకర్యంగా ఉంటే..

మీ మాజీ లైంగిక అనుభవాలను ప్రస్తుతంతో పోల్చవద్దు. వాస్తవానికి ఈ విషయాలను చర్చించడం చాలా అవసరం. కానీ సెక్స్ తర్వాత వెంటనే చేయడం మాత్రం సరికాదు. తీవ్రమైన విషయాలను చర్చించకుండా... మీ భాగస్వామిని మీకు నచ్చిన విధంగా చేయమని ఒప్పించడం ఉత్తమం. ఒకవేళ అతను/ఆమె అంతకుముందు ఏదైనా విషయంలో సౌకర్యంగా లేకుంటే.. దానిని అక్కడితో వదిలేయడమే మంచిదని సీమా ఆనంద్ స్పష్టం చేశారు.

 

టాపిక్