తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd And Sugar : ఖాళీ కడుపుతో పెరుగు, పంచదార తింటే ఇన్ని లాభాలా?

Curd and Sugar : ఖాళీ కడుపుతో పెరుగు, పంచదార తింటే ఇన్ని లాభాలా?

HT Telugu Desk HT Telugu

27 March 2023, 16:00 IST

  • Curd and Sugar : ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే.. లేదా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో అమ్మమ్మ పెరుగులో పంచదార కలిపి ఇచ్చే ఉంటుంది కదా. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది ఉదయం ఖాళీ కడుపుతోనే పెరుగు, పంచదార తినమని చెబుతారు.

ఖాళీ కడుపుతో పెరుగు పంచదార
ఖాళీ కడుపుతో పెరుగు పంచదార (unsplash)

ఖాళీ కడుపుతో పెరుగు పంచదార

మన పెద్దలు ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. పెరుగు(Curd) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. చక్కెర మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు పంచదార తింటే ఏమవుతుంది? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

ఉదర సమస్యలు తొలగిపోతాయి

పెరుగులో మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన పొట్టను ఆరోగ్యంగా(Stomach Health) ఉంచుతుంది. ఉదయాన్నే పెరుగు తినడం వల్ల మన పేగులకు చాలా మంచిది. మన పొట్టలో మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెంది రోగ నిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది. ఈ బ్యాక్టీరియా మీ కడుపు సమస్యలను(Stomach Problems) మాత్రమే కాకుండా పెద్దప్రేగు క్యాన్సర్ సమస్యను కూడా నయం చేస్తుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది

మీకు తెలుసా మీ శరీరం పాలు కంటే పెరుగును వేగంగా జీర్ణం చేస్తుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్(Breakfast)తో పాటు పెరుగు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది త్వరగా జీర్ణమవుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యకు పరిష్కారం

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళలకు సాధారణ సమస్య. ఇది ప్రధానంగా మూత్రాశయం, మూత్రనాళంపై ప్రభావం చూపుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిళలు మూత్ర విసర్జన సమయంలో నొప్పిని అనుభవిస్తారు. అందుకోసం ఉదయం ఒక గిన్నె పెరుగు, పంచదార తీసుకోవాలి. బర్నింగ్ సెన్సేషన్ తగ్గించడానికి ఇది గొప్ప మార్గం. పెరుగు మూత్రాశయాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగులో విటమిన్ల(Vitamins)తోపాటుగా కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

తక్షణ గ్లూకోజ్‌గా పనిచేస్తుంది

రోజంతా సరిగ్గా పనిచేయడానికి మీ శరీరానికి తగిన మొత్తంలో గ్లూకోజ్(glucose) అవసరం. ఉదయాన్నే ఒక గిన్నె పంచదార, పెరుగు చాలా మంచిది. ఇది రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

కడుపుని చల్లగా ఉంచుతుంది

మలబద్ధకం(Constipation), అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతుంటే, ఒక గిన్నె చక్కెర, పెరుగు మీ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ చక్కెర, పెరుగు కలయిక మీ కడుపుకు చాలా మంచిది. ఇది గాల్ బ్లాడర్ పనిచేయకపోవడాన్ని తగ్గిస్తుంది. కడుపు చికాకు, ఆమ్లతను తగ్గిస్తుంది.

ఉదయాన్నే పెరుగులో చక్కెర(Curd With Sugar) కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ జలుబు, కఫా సమస్య, మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు దూరంగా ఉంటారు.