తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hepatitis Day 2022 : ప్రాణాలు హరించే వ్యాధి హెపటైటిస్.. జాగ్రత్తలు తీసుకోండి..

Hepatitis Day 2022 : ప్రాణాలు హరించే వ్యాధి హెపటైటిస్.. జాగ్రత్తలు తీసుకోండి..

28 July 2022, 11:13 IST

    • బాక్టీరియా, వైరస్‌లు లేదా పరాన్నజీవుల వల్ల కలిగే తీవ్రమైన కాలేయ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. హెపటైటిస్ కారణాలను అర్థం చేసుకుని.. ఆ ప్రమాదాన్ని తగ్గించగల వివిధ మార్గాలను కూడా అర్థం చేసుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. 
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2022
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2022

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2022

World Hepatitis Day 2022 : ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 28న నిర్వహిస్తున్నారు. కానీ ప్రారంభంలో దీనిని మే 19వ తేదీన పాటించారు. తర్వాత 2010లో జూలై 28కి మార్చేశారు. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రపంచ హైపటైటిస్ డేకి ప్రధాన లక్ష్యం. హెపటైటిస్ అనేది మన కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయ వ్యాధులు ప్రాణాంతకం కాబట్టి.. ఈ వ్యాధిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. హెపటైటిస్‌కు గల కారణాలను అర్థం చేసుకోవడం వల్ల దీని బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

హెపటైటిస్ ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఇది తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 1.34 మిలియన్ల మంది దీనివల్ల ప్రాణాలు వదులుతున్నారు అంటే మీరే అర్థం చేసుకోవాలి ఇది ఎంత ప్రమాదకరమైనదో.

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2022 థీమ్

హెపటైటిస్ తీవ్రమైన లేదా దీర్ఘకాలిక అనారోగ్యం. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహించడమతో పాటు ఓ థీమ్ అనుకుంటారు. ఈ సంవత్సరం "హెపటైటిస్ సంరక్షణను మీకు చేరువ చేయడం" థీమ్.

కారణాలను తెలుసుకోవడంతో పాటు.. హెపటైటిస్ ప్రమాదాన్ని తగ్గించగల వివిధ మార్గాలను కూడా తెలుసుకోవాలి. అందుకే హెపటైటిస్‌కు కారణమయ్యే వివిధ అంశాలను, హెపటైటిస్ తగ్గించే సాధారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రమాద కారకాలు ఏమిటి?

హెపటైటిస్ A, B, C, D, E అన్నీ కొన్ని మార్గాల్లో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. కారణాలు, ప్రమాదాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. వాపు వస్తుంది. కాలేయం వాపు (సాధారణంగా హెపటైటిస్ అని పిలుస్తారు) వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవించవచ్చు. అన్ని లక్షణాలు దాదాపుగా దగ్గరగా ఉన్నందున.. రోగనిర్ధారణ పరీక్ష లేకుండా దానిని గుర్తించడం అసాధ్యం. రెగ్యులర్ చెకప్, రోగనిర్ధారణ లేకపోవడమే ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణమవుతున్నాయి.

హెపటైటిస్ లక్షణాలు

ఆకలిని కోల్పోవడం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం (కామెర్లు), లేత మలం, మసకబారడం, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు, అలసట, బరువు తగ్గడం, వికారం, జ్వరం, వాంతులు మొదలైనవి. ఏది ఏమైనప్పటికీ ఈ సాధారణ లక్షణాలు పక్కన పెడితే.. కాలేయానికి హాని జరిగే వరకు దుష్ప్రభావాలు సరిగా కనిపించవు.

హెపటైటిస్ ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు?

1. వివిధ రకాల హెపటైటిస్‌లకు వివిధ రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి.

2. వ్యక్తిగత పరిశుభ్రత పాఠించడం చాలా ముఖ్యం. మీరు, మీ పరిసరాలు శుభ్రంగా ఉంటే హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచే వైరస్‌ల నుంచి దూరంగా ఉండేలా చూస్తుంది.

3. వ్యక్తిగత వస్తువులను ఎల్లప్పుడూ వినియోగించడం మంచిది. ఇది హెపటైటిస్‌తో పాటు వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. పూర్తిగా వండిన ఆహారాన్ని తినాలి. కలుషితమైన లేదా పచ్చిగా తినడం వల్ల హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది.

5. ఎల్లప్పుడూ శుభ్రమైన నీటిని తీసుకోవాలి. స్వచ్ఛమైన నీరు దొరకని ప్రదేశానికి ప్రయాణిస్తున్నట్లయితే.. మంచి నీరు తీసుకెళ్లాలని గుర్తించుకోండి.

6. లైంగిక భాగస్వాములతో బహిరంగ సంభాషణ చేయండి. వారి ఆరోగ్య చరిత్ర గురించి తెలుసుకోండి. వారికి ఏవైనా అంటు వ్యాధులు ఉంటే అవి మీకు వచ్చే ప్రమాదముంది.

టాపిక్