తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  World Hepatitis Day 2022 | హెపటైటిస్‌తో కాలేయం ఖరాబ్.. నివారణ మార్గాలివిగో!

World Hepatitis Day 2022 | హెపటైటిస్‌తో కాలేయం ఖరాబ్.. నివారణ మార్గాలివిగో!

27 July 2022, 22:17 IST

1967లో హెపటైటిస్ బి వైరస్‌ను కనుగొన్న డాక్టర్ బరూచ్ బ్లమ్‌బెర్గ్ గౌరవార్థం ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రెండేళ్ల తర్వాత 1969లో డాక్టర్ బరూచ్ హెపటైటిస్ బి కోసం వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేశారు.

  • 1967లో హెపటైటిస్ బి వైరస్‌ను కనుగొన్న డాక్టర్ బరూచ్ బ్లమ్‌బెర్గ్ గౌరవార్థం ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రెండేళ్ల తర్వాత 1969లో డాక్టర్ బరూచ్ హెపటైటిస్ బి కోసం వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేశారు.
వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 334 మిలియన్ల మంది హెపటైటిస్ B, C లతో బాధపడుతున్నారు. ఈ హెపటైటిస్ వలన కాలేయం పనితీరు దెబ్బతింటుంది. హెపటైటిస్ కారణంగా కాలేయంలో మంట, వాపు ఉంటుంది. ఈ పరిస్థితికి చికిత్స లేదు. అయితే రాకుండా నివారించవచ్చు. హెపటైటిస్‌ను అరికట్టడానికి, అలాగే మీ కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
(1 / 7)
వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 334 మిలియన్ల మంది హెపటైటిస్ B, C లతో బాధపడుతున్నారు. ఈ హెపటైటిస్ వలన కాలేయం పనితీరు దెబ్బతింటుంది. హెపటైటిస్ కారణంగా కాలేయంలో మంట, వాపు ఉంటుంది. ఈ పరిస్థితికి చికిత్స లేదు. అయితే రాకుండా నివారించవచ్చు. హెపటైటిస్‌ను అరికట్టడానికి, అలాగే మీ కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.(Shutterstock)
క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి: బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండి, తరచుగా అనారోగ్యం బారినపడుతుంటే ఆలస్యం చేయకూడదు. వీలైనంత త్వరగా హెపటైటిస్ పరీక్ష చేయించుకోవాలి.
(2 / 7)
క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి: బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండి, తరచుగా అనారోగ్యం బారినపడుతుంటే ఆలస్యం చేయకూడదు. వీలైనంత త్వరగా హెపటైటిస్ పరీక్ష చేయించుకోవాలి.(WebMD)
టీకా: సరైన సమయంలో టీకాలు వేయించుకోవడం ద్వారా హెపటైటిస్ A అలాగే B నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. 18 ఏళ్ల లోపు వారు, ఇప్పటివరకు టీకాలు వేసుకోని పెద్దలు కూడా తప్పనిసరిగా హెపటైటిస్ A, B కి వ్యతిరేకంగా టీకాలు వేసుకోవాలి.
(3 / 7)
టీకా: సరైన సమయంలో టీకాలు వేయించుకోవడం ద్వారా హెపటైటిస్ A అలాగే B నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. 18 ఏళ్ల లోపు వారు, ఇప్పటివరకు టీకాలు వేసుకోని పెద్దలు కూడా తప్పనిసరిగా హెపటైటిస్ A, B కి వ్యతిరేకంగా టీకాలు వేసుకోవాలి.(Shutterstock)
పరిశుభ్రతను పాటించండి: హెపటైటిస్‌ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. టూత్ బ్రష్, రేజర్లు, సూదులను ఇతరులతో పంచుకోవద్దు. టాయిలెట్‌కి వెళ్లిన ప్రతిసారీ, భోజనానికి ముందు, ఆ తర్వాత కూడా మీ చేతులను సబ్బుతో కడగాలి. కాచి చల్లార్చిన శుద్ధమైన నీరు త్రాగాలి.
(4 / 7)
పరిశుభ్రతను పాటించండి: హెపటైటిస్‌ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. టూత్ బ్రష్, రేజర్లు, సూదులను ఇతరులతో పంచుకోవద్దు. టాయిలెట్‌కి వెళ్లిన ప్రతిసారీ, భోజనానికి ముందు, ఆ తర్వాత కూడా మీ చేతులను సబ్బుతో కడగాలి. కాచి చల్లార్చిన శుద్ధమైన నీరు త్రాగాలి.(Unsplash)
సురక్షితమైన శృంగార జీవనాన్ని కలిగి ఉండాలి: హెపటైటిస్‌ వైరస్ యోని స్రావాలు, లాలాజలం, వీర్యంలో కూడా కనుగొనడం జరిగింది. కాబట్టి సురక్షితమైన సెక్స్‌ లైఫ్ కలిగి ఉండటం ద్వారా వైరల్ హెపటైటిస్‌ సంక్రమణను అరికట్టవచ్చు.
(5 / 7)
సురక్షితమైన శృంగార జీవనాన్ని కలిగి ఉండాలి: హెపటైటిస్‌ వైరస్ యోని స్రావాలు, లాలాజలం, వీర్యంలో కూడా కనుగొనడం జరిగింది. కాబట్టి సురక్షితమైన సెక్స్‌ లైఫ్ కలిగి ఉండటం ద్వారా వైరల్ హెపటైటిస్‌ సంక్రమణను అరికట్టవచ్చు.(Unsplash)
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి: మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీరు పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాన్ని తినాలి. వాల్‌నట్‌లు, బీట్‌రూట్‌లు, పసుపు, వెల్లుల్లి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
(6 / 7)
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి: మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీరు పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాన్ని తినాలి. వాల్‌నట్‌లు, బీట్‌రూట్‌లు, పసుపు, వెల్లుల్లి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి

Liver Health | లివర్‌ని లవర్‌లా ప్రేమగా చూసుకోవాలి.. ఈ చెడు అలవాట్లను మానేయండి!

Liver Health | లివర్‌ని లవర్‌లా ప్రేమగా చూసుకోవాలి.. ఈ చెడు అలవాట్లను మానేయండి!

Apr 19, 2022, 09:36 PM
Liver Health | మద్యపానమే కాదు.. పండ్లు ఎక్కువగా తింటే కూడా లివర్ చెడిపోతుందట!

Liver Health | మద్యపానమే కాదు.. పండ్లు ఎక్కువగా తింటే కూడా లివర్ చెడిపోతుందట!

Jul 04, 2022, 08:51 AM
liver tips: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

liver tips: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

May 14, 2022, 07:18 PM
World Liver Day 2022 | కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.. లేదంటే అంతే సంగతులు..

World Liver Day 2022 | కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.. లేదంటే అంతే సంగతులు..

Apr 19, 2022, 03:25 PM
Fatty liver | కాలేయ వాపును తగ్గించే ఆహార పదార్థాలు..

Fatty liver | కాలేయ వాపును తగ్గించే ఆహార పదార్థాలు..

Mar 04, 2022, 08:47 AM