తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thyroid Eye Disease । కళ్లు ఉబ్బాయా.. థైరాయిడ్ కంటి వ్యాధి కావచ్చు, చికిత్స ఇదే!

Thyroid Eye Disease । కళ్లు ఉబ్బాయా.. థైరాయిడ్ కంటి వ్యాధి కావచ్చు, చికిత్స ఇదే!

HT Telugu Desk HT Telugu

06 April 2023, 11:32 IST

    • Thyroid Eye Disease: కళ్లు ఉబ్బి బయటకు వచ్చినట్లుగా ఉన్నాయంటే అది థైరాయిడ్ కంటి వ్యాధి లక్షణం కావచ్చు. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందా? చికిత్స ఏమిటి, ఇక్కడ తెలుసుకోండి.
Thyroid Eye Disease- Eye Health
Thyroid Eye Disease- Eye Health (Unsplash)

Thyroid Eye Disease- Eye Health

World Health Day 2023: థైరాయిడ్ కంటి వ్యాధి (Thyroid Eye Disease- TED) అనేది ఒక స్వయం ప్రతిరక్షక (Auto Immune) వ్యాధి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణజాలాలపైనే దాడి చేయడం వలన సంభవించేది. థైరాయిడ్ కంటి వ్యాధి ఉన్నప్పుడు కంటి కండరాలు, కనురెప్పలు, కన్నీటి గ్రంధులు అలాగే కంటి వెనుక ఉన్న కొవ్వు కణజాలం దెబ్బతింటుంది. తద్వారా కళ్ళు ఎర్రబడటం, కనురెప్పలు, కంటి చుట్టూ ఉన్న చర్మం వాపు ఉంటుంది. కళ్ళు ముందుకు నెట్టుకొచ్చినట్లుగా ఉంటుంది. TED ఉన్నప్పుడు కళ్లలో తీవ్రమైన అసౌకర్యం, నొప్పి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

థైరాయిడ్ కంటి వ్యాధి తరచుగా గ్రేవ్స్ వ్యాధితో (Graves' disease) సంబంధాన్ని కలిగి ఉంటుంది, ఇది థైరాయిడ్, కళ్ళు, చర్మంపై ప్రభావం చూపుతుంది. గ్రేవ్స్ వ్యాధి హైపర్ థైరాయిడిజంకు కారణమవుతుంది, అంటే మీ శరీరం చాలా థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. కొన్నిసార్లు హైపోథైరాయిడిజమ్‌కు కూడా కారణమవుతుంది, అంటే మీ శరీరం తగినంత హార్మోన్‌లను విడుదల చేయదు. ఈ రెండు పరిస్థితులు థైరాయిడ్ కంటి వ్యాధికి దారి తీయవచ్చు. అంటే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఈ థైరాయిడ్ కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కలిగిన వ్యక్తుల్లో కంటివాపు, కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ కంటి వ్యాధి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, శరీరం ఇచ్చే సంకేతాలు ఏమిటో ఈ కింద చూడండి.

Thyroid Eye Disease Symptoms- థైరాయిడ్ కంటివ్యాధి లక్షణాలు

  • పొడి కళ్ళు
  • కళ్ళలో చికాకు
  • నీళ్ళు నిండిన కళ్ళు
  • ఎరుపు కళ్ళు
  • ఉబ్బిన కళ్ళు
  • రెప్పవేయని, తదేకమైన చూపు, కళ్లుమూయలేని పరిస్థితి
  • రెండు ప్రతిబింబాలు కనిపించడం లేదా డిప్లోపియా
  • కంటి కార్నియాపై పుండు
  • కంటి వెనుక నొప్పి, కంటి కదలికలతో నొప్పి

TED అంటువ్యాధా? చికిత్స, నివారణ మార్గాలు ఏమిటి?

థైరాయిడ్ కంటి వ్యాధి అనేది అంటువ్యాధి (Contagious) కాదు. ఇది ఒకరిని చూడటం వలన గానీ, మరేరకంగా గానీ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందదు. ఈ వ్యాధిని మందులు, శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు. జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా TED రాకుండా నివారించవచ్చు.

ఈ వ్యాధికి చికిత్సలో ధూమపానం (smoking) మానేయమని వైద్యులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఈ అలవాటు థైరాయిడ్ కంటి వ్యాధిని మరింత పెంచే ప్రమాదాన్ని కలిగిస్తుంది, చికిత్స ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

కళ్ళపై కూల్ కంప్రెస్‌లను ఉపయోగించడం. సన్ గ్లాసెస్ ధరించడం, పడుకున్నప్పుడు మీ తల మీ శరీరం కంటే ఎత్తుగా ఉంచడం. సెలీనియం సప్లిమెంట్లను తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, కనురెప్పలు వేయడం, కళ్లు మూసుకొని పడుకోవడం, థైరాయిడ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవడం తదితర చర్యల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.