తెలుగు న్యూస్  /  Lifestyle  /  Woman Orders Sanitary Pads From Swiggy Instamart And Receives Free Cookies

Free cookies with Sanitary pads: శానిటరీ ప్యాడ్స్ ఆర్డర్ చేస్తే చాక్లెట్లూ ఫ్రీ

HT Telugu Desk HT Telugu

26 January 2023, 16:36 IST

  • Free cookies with Sanitary pads: శానిటరీ ప్యాడ్స్ ఆర్డర్ చేస్తే చాక్లెట్లూ ఫ్రీ.. ఇది ఆఫర్ కాదండోయ్.. అనూహ్యంగా, అప్రకటితంగా వచ్చిన ఈ ఆఫర్ ఓ మహిళను అమితానందానికి గురిచేసింది.

శానిటరీ ప్యాడ్స్‌తో పాటు చాక్లెట్ కుకీస్ అందుకున్న మహిళ (ప్రతీకాత్మక చిత్రం)
శానిటరీ ప్యాడ్స్‌తో పాటు చాక్లెట్ కుకీస్ అందుకున్న మహిళ (ప్రతీకాత్మక చిత్రం) (Pexels (Roman Odintsov))

శానిటరీ ప్యాడ్స్‌తో పాటు చాక్లెట్ కుకీస్ అందుకున్న మహిళ (ప్రతీకాత్మక చిత్రం)

పీరియడ్స్‌ వచ్చినప్పుడు చాక్లెట్లంటే ఎక్కువగా ఇష్టపడుతారు. అవి మానసిక స్థితిని పెంచడంలో సహాయపడటమే కాకుండా, పీరియడ్ క్రాంప్స్‌ను కూడా తగ్గిస్తాయని నమ్ముతారు. చాక్లెట్లు, పీరియడ్స్‌కు మధ్య బలమైన సంబంధం కలిగి ఉండటానికి ఇదే కారణం. దీనిని పరిగణనలోకి తీసుకున్న స్విగ్గీ తన ఇన్‌స్టా మార్ట్ ద్వారా శానిటరీ ప్యాడ్‌లను ఆర్డర్ చేసిన కస్టమర్‌కు చాక్లెట్ కుకీస్ కూడా ఫ్రీగా డెలివరీ చేసి మనసు దోచేసింది. ఆర్డర్ అందుకున్న తర్వాత ఆ మహిళ ఆశ్చర్యానికి లోనైంది. దాని గురించి ట్విట్టర్‌లో పంచుకుంది. వెంటనే దీనిపై నెటిజన్లు తమ ఆలోచనలను పంచుకుననారు.

ట్రెండింగ్ వార్తలు

Vampire Facial: వాంపైర్ ఫేషియల్ చేయించుకుంటే HIV సోకింది జాగ్రత్త, అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం

Rachakonda Trip: హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న రాచకొండ కోటను కచ్చితంగా చూడాల్సిందే, ఒక్కరోజులో వెళ్లి రావచ్చు

Spicy Chutney: మినప్పప్పు పచ్చడి... ఓసారి చేసి చూడండి, వేడి వేడి అన్నంలో స్పైసీగా అదిరిపోతుంది

King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట

‘నేను @SwiggyInstamart నుండి శానిటరీ ప్యాడ్స్ ఆర్డర్ చేశాను. బ్యాగ్ కింద చాక్లెట్ కుకీస్ కూడా చూసి ఆశ్చర్యపోయాను. చాలా ఆలోచనాత్మకం. అయితే ఈ పని స్విగ్గీ చేసిందా?  లేక షాప్ కీపరా? ఎవరు చేశారో మాత్రం తెలియదు..’ అని ట్విట్టర్ యూజర్ సమీరా ట్వీట్ చేశారు.

కొన్ని నిమిషాల్లోనే స్విగ్గీ తన అధికారిక హ్యాండిల్ ద్వారా దీనికి బదులిచ్చింది. ‘సమీరా, మీకు ఇది సంతోషకరమైన రోజు కావాలని మేం కోరుకుంటున్నాం..’ అని పేర్కొంది.

ఈ ట్వీట్ నిన్న ప్రచురితమైంది. అప్పటి నుంచి దాదాపు 87,200 వ్యూస్ వచ్చాయి. 1,200 లైక్స్ కూడా వచ్చాయి. చాలా మంది దీనిని రీట్వీట్ చేశారు. కామెంట్లు కూడా చేశారు. స్విగ్గీ చర్యను మెచ్చుకున్నారు.