తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vampire Facial: వాంపైర్ ఫేషియల్ చేయించుకుంటే Hiv సోకింది జాగ్రత్త, అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం

Vampire Facial: వాంపైర్ ఫేషియల్ చేయించుకుంటే HIV సోకింది జాగ్రత్త, అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం

Haritha Chappa HT Telugu

01 May 2024, 14:00 IST

google News
    • Vampire Facial: అందం మీద మోజు పెరుగిపోతున్న రోజులు ఇవి. అలా ముగ్గురు మహిళలు వాంపైర్ ఫేషియల్ చేయించుకుంటే వారికి హెచ్ఐవి సోకింది. వాంపైర్ ఫేషియల్ వల్ల ఎలా HIV సోకిందో తెలుసుకోండి.
వాంపైర్ ఫేషియల్
వాంపైర్ ఫేషియల్

వాంపైర్ ఫేషియల్

Vampire Facial: వాంపైర్ ఫేషియల్ అనేది ఖర్చుతో కూడుకున్న పని. అదొక కాస్మెటిక్ ప్రక్రియ. అయితే అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన ప్రకారం వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు హెచ్ఐవి సోకినట్టు నిర్ధారించింది. న్యూ మెక్సికోలో ముగ్గురు మహిళలు ఈ వ్యాంపైర్ ఫేషియల్ చేయించుకున్న తర్వాత హెచ్ఐవి బారిన పడ్డారని ఆ సంస్థ ఇచ్చిన నివేదిక చెబుతోంది.

ఏమిటీ వాంపైర్ ఫేషియల్?

వాంపైర్ ఫేషియల్ ని PRP థెరపీ (ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా) అని కూడా పిలుస్తారు. దీనిలో ప్లాస్మా, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు, ఎర్ర రక్త కణాలను వేరు చేస్తారు. ప్లాస్మాలో ప్లేట్లెట్లు పుష్కలంగా ఉంటాయి. ఆ ప్లేట్లెట్లను ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ఉన్న చర్మంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే కొల్లాజిన్ ఉత్పత్తి పెరుగుతుందో... ముడతలు, సన్నని గీతలు వంటివి ఏర్పడవు. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బ తినడం తగ్గుతుంది. అలాగే మొటిమలు రాకుండా ఉంటాయి. అందుకోసమే వాంపైర్ ఫేషియల్ చేయించుకునే వారి సంఖ్య పెరుగుతుంది.

ఫేషియల్ చేయించుకున్నాక కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఒక వారం పాటు తీవ్రమైన ఎండలోకి వెళ్ళకూడదు. తీవ్రమైన వ్యాయామాలు చేయకూడదు. చెమట అధికంగా పట్టే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ వాంపైర్ ఫేషియల్ ఒక సెషన్ 15 వేల రూపాయల నుండి 30 వేల వరకు ఖర్చు అవుతుంది.

ఇది కాస్త రిస్క్ తో కూడిన ఫేషియల్ అనే చెప్పుకోవాలి. రక్తం స్వచ్ఛమైనది అయితే పరవాలేదు, కానీ ఇన్ఫెక్షన్లు కలిగిన రక్తాన్ని సేకరించి చర్మంలోకి ఇంజెక్ట్ చేస్తే ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మహిళలకు హెచ్ఐవి ఉన్న రక్తాన్ని లేదా సూదిని వాడడం వల్ల ఆ వ్యాధి బారిన పడినట్టు నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ కాస్మెటిక్ ప్రక్రియలో ఎవరి రక్తాన్ని వారికే ఎక్కిస్తారు. ఏమైనా అందం కంటే ఆరోగ్యం ముఖ్యదని ముఖ్యమైనదని గ్రహించాలి. ఇలాంటి కాస్మెటిక్ ప్రక్రియల జోలికి వెళ్లకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అందాన్ని పెంచుకోవడం మంచిది.

అమెరికాలోని ముగ్గురు మహిళలకు హెచ్ఐవీ ఎలా సోకిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వారి వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. వారికి తమ భర్తతో తప్ప ఎవరితోనూ లైంగిక సంబంధాలు లేవని చెప్పారు. అలాగే 2018లో చివరగా తాము వాంపైర్ ఫేషియల్ చేయించుకున్నామని, ఆ తరువాత ఎలా ఇంజెక్షన్లు, టీకాలు తీసుకోలేదని చెప్పారు. వీరంతా ఒకే దగ్గర ఫేషియల్ వాంపైర్ చేయించుకున్నట్టు తేలింది. అక్కడికి వెళ్లి చూడగా.. వారు వాడిన సూదులను వాడడం, కొంత మంది రక్తాన్ని స్టోర్ చేసి వాటిని కూడా ఫేషియల్ కోసం వాడడం వంటివి చేసినట్టు గుర్తించారు. ఇలా వాంపైర్ ఫేషియల్ ద్వారానే ఈ లైంగిక వ్యాధి సోకినట్టు గుర్తించారు.

టాపిక్

తదుపరి వ్యాసం