తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curry Leaves For Hair : కరివేపాకుతో ఇలా చేస్తే.. నల్లగా మెరిసే జుట్టు మీ సోంతం

Curry Leaves For Hair : కరివేపాకుతో ఇలా చేస్తే.. నల్లగా మెరిసే జుట్టు మీ సోంతం

HT Telugu Desk HT Telugu

06 March 2023, 13:30 IST

google News
    • Curry Leaves For Healthy Hair : జుట్టు సమస్యలు ఈ కాలంలో ఎక్కువైపోయాయి. జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, చుండ్రు, జుట్టు పొడిబారడం లాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.. నల్లని, ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.
హెయిర్ టిప్స్
హెయిర్ టిప్స్

హెయిర్ టిప్స్

జుట్టు సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, రసాయనాలు కలిపిన షాంపులు, కండీషనర్ ల వాడకంతో ఇలా జరుగుతుంది. కొంతమంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు(White Hair) సమస్య, జుట్టు రాలిపోవడం(Hair Loss) లాంటి వాటిని ఎదుర్కొంటున్నారు. అయితే ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టు నల్లగా ఒత్తుగా మారుతుంది. బయట ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా.. రాని ఫలితం.. కరివేపాకు(Curry Leaves)తో ఉంటుంది.

జుట్టును అందంగా మార్చుకునేందుకు కరివేపాకు బెస్ట్ ఆప్షన్. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కరివేపాకును ఉపయోగించడం కారణంగా జుట్టు(Hair) రాలడం తగ్గుతుంది. అంతేకాదు.. కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు తెల్లబడటం(White Hair) తగ్గుతుంది. పొడవుగా, ఒత్తుగా, నల్లగా మారుతుంది. అయితే కరివేపాకును ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

జుట్టుకు సరిపోయేంత కరివేపాకును తీసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో పెరుగు(Curd) కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనిని జుట్టుకు పట్టించాలి. మెల్లగా మర్దనా చేసుకోవాలి. ఆరే వరకు ఇలానే ఉంచుకోవాలి. అనంతరం తలస్నానం(Head Bath) చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు, తలలో దురద లాంటి సమస్యలు తగ్గుతాయి.

మరో చిట్కాను కూడా పాటించొచ్చు. కరివేపాకును తీసుకుని శుభ్రంగా కడగాలి. జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇందులో నుంచి రసాన్ని తీయాలి. రసంలో తగిన షాంపును కలుపుకోవాలి. జుట్టుకు పట్టించుకుని.. పావుగంట అలానే ఉంచుకోండి. దీంతో జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. కరివేపాకుతో చాలా వరకు జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

కరివేపాకులో కాల్షియం, ఫాస్పరస్ , ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఎ కూడా ఉంటాయి. కరివేపాకును కొబ్బరినూనె(Coconut Oil)తో కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కరివేపాకులో ఉండే ఐరన్, ప్రొటీన్ జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది కుదుళ్ళకు పోషణ ఇస్తుండటం వలన, జుట్టు సులభంగా రాలదు. ఫలితంగా జుట్టు పల్చబడటం అనే సమస్యను దూరం చేసుకోవచ్చు.

దీర్ఘకాలం పాటు ఒత్తిడి(Stress)ని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం