తెలుగు న్యూస్ / ఫోటో /
Curry Leaves for Hair । జుట్టు రాలిపోతుందా? కరివేపాకుతో కంట్రోల్ చేయొచ్చు!
- Curry Leaves for Hair: చలికాలంలో పొడి చర్మం కారణంగా జుట్టు రాలిపోతుందా? అయితే కరివేపాకుఈ సమస్యను దూరం చేస్తుంది. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
- Curry Leaves for Hair: చలికాలంలో పొడి చర్మం కారణంగా జుట్టు రాలిపోతుందా? అయితే కరివేపాకుఈ సమస్యను దూరం చేస్తుంది. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
(1 / 8)
జుట్టు సంరక్షణ కోసం చాలా మంది చాలా రకాల ఉపాయాలు ప్రయోగిస్తారు. అయితే ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఇవి జుట్టు రాలడాన్ని కూడా నివారించి, పెరుగుదలకు ఉపయోగపడతాయి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.(Freepik)
(2 / 8)
మనం కూరల్లో వేసే కరివేపాకును జుట్టు రాలడం అరికట్టడానికి ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఆయుర్వేద వైద్యంలో కరివేపాకును కూడా బహుళ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జుట్టు సమస్యలకు కూడా.(Freepik)
(3 / 8)
కరివేపాకులో కాల్షియం, ఫాస్పరస్ , ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఎ కూడా ఉంటాయి.(Freepik)
(4 / 8)
కరివేపాకును కొబ్బరినూనెతో కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.(Freepik)
(5 / 8)
పెరుగు, కరివేపాకులను కలపడం ద్వారా అద్భుతమైన హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.(Freepik)
(6 / 8)
కరివేపాకులో ఉండే ఐరన్, ప్రొటీన్ జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది కుదుళ్ళకు పోషణ ఇస్తుండటం వలన, జుట్టు సులభంగా రాలదు. ఫలితంగా జుట్టు పల్చబడటం అనే సమస్యను దూరం చేసుకోవచ్చు.(Freepik)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు