Hair Fall Control Tips : మీ ఆహారంలో వీటిని తీసుకుంటే.. హెల్తీ హెయిర్​ మీ సొంతం..-5 foods to prevent hair loss in winter here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  5 Foods To Prevent Hair Loss In Winter Here Is The Details

Hair Fall Control Tips : మీ ఆహారంలో వీటిని తీసుకుంటే.. హెల్తీ హెయిర్​ మీ సొంతం..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 30, 2022 10:37 AM IST

Hair Fall Control Tips : ఎన్ని మాస్క్​లు వేసుకున్నా.. ఎంత నూనె పెట్టినా.. ఎంత శ్రద్ధ తీసుకున్నా.. సరైనా ఆహారం తీసుకోకుంటే జుట్టు రాలడం పక్కా అంటున్నారు నిపుణులు. జుట్టుమీద శ్రద్ధ పెట్టడంతో పాటు.. తీసుకునే ఆహారంపై కూడా కనీస శ్రద్ధ పెట్టాలి అంటున్నారు.

జుట్టు సంరక్షణ
జుట్టు సంరక్షణ

Hair Fall Diet : స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారు. కానీ మారుతున్న వాతావరణం, జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల.. జుట్టు రాలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చుండ్రు సమస్య జుట్టు రాలడాన్ని తీవ్రం చేస్తుంది. ఇప్పుడు ప్రజల్లో బట్టతల సమస్య కూడా ఎక్కువగా ఉంది. అందుకే జుట్టు రాలకుండా చికిత్స నుంచి ఇంటి నివారణల వరకు అన్ని ట్రై చేస్తున్నారు. ఇవి చేయొద్దని చెప్పట్లేదు కానీ.. మీరు తినే ఆహారం కూడా మీ జుట్టుపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు. మీ ఆహారంలో కొన్ని తీసుకుంటే.. ఈ సమస్య తగ్గుతుంది అంటున్నారు. ఇంతకీ వేటిని తింటే జుట్టుకు మంచిదో.. జుట్టు ఆరోగ్యంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రొటీన్

జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్, బయోటిన్ చాలా ముఖ్యం. ఈ రెండు మూలకాలు జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా వాటి పెరుగుదలకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా ఈ మూలకాలు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. అందుకే మీ ఆహారంలో గుడ్లను కచ్చితంగా చేర్చుకోండి. ప్రొటీన్‌తో పాటు.. గుడ్లలో జింక్, సెలీనియం కూడా ఉన్నాయి. ఇవి జుట్టుకు చాలా ముఖ్యమైనవి. బయోటిన్ కెరాటిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఒక రకమైన జుట్టుకు కావాల్సిన ప్రోటీన్.

బచ్చలికూర

బచ్చలికూరలో విటమిన్ ఎ, సి, ఐరన్మ, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఎ చర్మ గ్రంథిలో ఉండే సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెబమ్ స్కాల్ప్​ను మాయిశ్చరైజ్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

క్యారెట్, చిలగడదుంపలు

మీ డైట్​లో క్యారెట్, చిలగడదుంపలు చేర్చుకుంటే జుట్టుకు చాలా మంచిది. ఇది జుట్టు రాలడాన్ని కంట్రోల్​ చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ఎ జుట్టు పెరుగుదలకు తోడ్పడటంతో పాటు వాటిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

ఓట్స్

ఇప్పటి వరకు మీరు ఓట్స్‌ను బరువు తగ్గించే వంటకంగా మాత్రమే ఉపయోగించి ఉంటారు. అయితే ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఓట్స్‌లో జింక్, ఐరన్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి జుట్టును పెంచడంతో పాటు వాటిని పొడవుగా, మందంగా మార్చడంలో సహాయపడతాయి.

వాల్‌నట్

వాల్‌నట్స్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా.. జుట్టుకు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ఉండే బయోటిన్, విటమిన్లు B1, B6, B9, E, మెగ్నీషియం జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.

జుట్టు రాలడానికి కారణాలు..

* జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. ఇది చాలా మందిలో జన్యుపరంగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఆహారం, పానీయాల కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అలర్జీని కలిగించే వాటిని తినవద్దు. ఇది కాకుండా ఆల్కలీన్, ఆమ్ల ఆహార పదార్థాలను తినడం మానుకోండి.

* చక్కెర కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. చక్కెర ఇన్సులిన్, ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇది జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది. జుట్టు రాలడానికి దారితీస్తుంది. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

* వేయించిన వాటిని తినడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అధిక కొవ్వు పదార్థాల వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా పురుషులలో బట్టతల సమస్య తలెత్తుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం