Egg diet food : గుడ్లతో ఈ ఆహారాలను తినడం మానుకోండి- లేకపోతే..!
Egg diet food : మీరు రోజు గుడ్లు తింటారా? ఇది మంచి విషయమే. అయితే.. గుడ్లతో వేరే ఆహార పదార్థాలను కలిపి తినడమే అరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం మీకు తెలుసా?
Avoid these mistakes while eating health : గుడ్లు.. ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికి తెలిసిన విషయమే. డైట్, వెయిట్‌లాస్, వెయిట్ గెయిన్.. ఏదైనా గుడ్లను చాలా మంది తమ ఆహారంలో తీసుకుంటారు. గుడ్లు తీసుకోవాలని వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్లు కూడా సూచిస్తూ ఉంటారు. గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. గుడ్లతో పాటు ఇతర ఆహారాలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి! ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము.
ఇవి తినకూడదు..
Eggs in Breakfast : అరటిపండి:- చాలా మంది ప్రతిరోజూ అల్పాహారంగా గుడ్లు, అరటిపండ్లు తినడానికి ఇష్టపడతారు. కానీ బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండ్లతో గుడ్లు కలిపి తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎందుకంటే ఈ రెండు ఆహార పదార్థాలను కలిపి తింటే రకరకాల జబ్బులు వస్తాయి. అరటిపండ్లు, గుడ్లు తినడం మీ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ప్రయోజనకరమే. కానీ ఈ రెండు ఆహారాలను వేర్వేరుగా తీసుకోవాల్సి ఉంటుంది.
నిమ్మకాయలు:- నిమ్మకాయను గుడ్డుతో కలపి ఎప్పుడూ తినకండి. ఇలా చేస్తే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. అలాగే, గుడ్లు చాలా వేడిని కలిగి ఉంటాయి కాబట్టి, వేసవిలో వాటిని తక్కువ తినడం శరీరానికి, గుండెకు మంచిది.
పుచ్చకాయలు:- పుచ్చకాయను గుడ్లతో కలిపి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్ట్రోఎంటెరిటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఈ రెండింటినీ ఒకేసారి తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
Egg and cheese : చీజ్:- గుడ్లను.. చీజ్‌తో సహా ఏ రకమైన పాల ఉత్పత్తులతో కలపకూడదు. ఇలా కలిపి తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఫలితంగా శరీరంలో ప్రొటీన్ల స్థాయిలు పెరిగి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
టీ- కాఫీ:- చాలా మంది అల్పాహారంగా గుడ్లు తీసుకుంటారు. ఆ వెంటనే.. టీ లేదా కాఫీని కడుపులో తోస్తారు. ఇది కూడా చెడ్డ అలవాటే! ఇలా చేసినా ఆరోగ్య సమస్యలు తప్పవు. రెండింటి మధ్య కాస్త గ్యాప్ ఇస్తే సరిపోతుంది.
చేపలు:- గుడ్లు, చేపలను కలిపి తినడం వల్ల అలెర్జీలు ఎక్కువగా వస్తాయి. ఈ రెండు ఆహార పదార్థాలను విడివిడిగా తీసుకుంటేనే మంచిది. ఇలా చేస్తేనే శరీరానికి కూడా మేలు జరుగుతుంది.
Eggs for good health : బ్రెడ్:- బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లతో పాటు సాధారణంగా కనిపించేది బ్రెడ్. కానీ ఈ రెండింటినీ కలిపి తింటే.. కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. రోజంతా ఇబ్బందికరంగానే ఉండొచ్చు. అందువల్ల.. బ్రెడ్, గుడ్లను వేరువేరుగా తీసుకోవాలి.
ఆహారం విషయంలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయండి.. ఫలితాలను మీరే చూడండి!
సంబంధిత కథనం