Reduce Split Ends : మీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Reduce Split Ends : దురదృష్టవశాత్తూ.. మీరు స్ప్లిట్ ఎండ్‌లను కలిగి ఉన్నారంటే.. వాటికి ఎలా ట్రీట్‌మెంట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాటికి సరైన చికిత్స ఏమి లేదు. వాటిని రాకుండా జాగ్రత్త తీసుకోవడమే. జుట్టు చివర్లు పాడైపోతే.. వాటిని కత్తిరించి.. మళ్లీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Reduce Split Ends : పొడుగైన జుట్టు కావాలని చాలా మంది అనుకుంటారు. ఈ మధ్య మగవాళ్లు కూడా జుట్టు పెంచుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఈ పొడి వాతావరణం మీ జుట్టును మరింత డ్యామేజ్ చేసేస్తుంది. అంతేకాకుండా.. చివర్లు చిట్లిపోయేలా చేస్తుంది. జుట్టు చిట్లిపోతే.. అది ఇంక పెరగదు. కాబట్టి మీ జుట్టును ఆరోగ్యంగా, చివర్లు చిట్లిపోకుండా, మృదువుగా ఉంచుకునేలా చేయడం చాలా అవసరం. దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్‌ని సున్నితంగా హ్యాండిల్ చేయండి..
హెయిర్ వాష్ చేసిన తర్వాత.. జుట్టును జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. తడి జుట్టు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి షాంపూ, కండిషనింగ్ తర్వాత మీ ట్రెస్‌లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
కొంతమందికి టవల్‌తో జుట్టును పొడిగా రుద్దడం అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. తరచుగా రుద్దడం వల్ల జుట్టు చిట్లుతుంది. ఇది మీ జుట్టు క్యూటికల్స్‌ను కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా చివర్లు చీలిపోవడం లేదా గజిబిజిగా మారుతుంది. మీ జుట్టును పొడిగా రుద్దడానికి బదులుగా.. డ్రైయర్ ఉపయోగించకుండా.. గాలికి ఆరేలా చూసుకోండి.
చిక్కులేకుండా చూసుకోండి..
చిక్కుబడ్డ జుట్టు, తడి లేదా పొడి అయినా.. దువ్వడం లేదా బ్రష్ చేయడం కష్టం. ముఖ్యంగా మీ జుట్టును స్టైలింగ్ చేయడానికి ముందు చిక్కుల్లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం పెద్ద దంతాలు కలిగిన దువ్వెనను ఎంచుకోండి. దీంతో చిక్కులు సులువుగా వచ్చేస్తాయి. పైగా ఇవి చివర్లు పాడవకుండా లేదా విరిగిపోకుండా కాపాడుతుంది.
మీ జుట్టును హైడ్రేట్‌గా ఉంచుకోండి..
స్ప్లిట్ చివరలను నివారించడానికి మీ జుట్టును తేమగా ఉంచడం కూడా కీలకం. పొడిబారడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. ముఖ్యంగా చివర్లలో దెబ్బతింటుంది. మీ జుట్టుకు తేమను ఇవ్వాలంటే.. వారానికోసారి హెయిర్ మాస్క్‌ని ఉపయోగించండి. హెయిర్ మాస్క్ అనేది లోతైన కండిషనింగ్ ట్రీట్‌మెంట్. ఇది మీ జుట్టును తేమతో నింపుతుంది. ఫలితంగా మృదువైన, మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.
హీట్‌కి హెయిర్‌ని దూరంగా ఉంచండి..
మీ జుట్టును కడిగిన తర్వాత గాలికి ఆరనివ్వండి. ఆపై కర్లింగ్ ఐరన్, ఫ్లాట్ ఐరన్ లేదా బ్లో-డ్రైయర్ ఉపయోగించకుండా స్టైల్ చేయండి. మీరు ఈ ఉపకరణాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటే.. హీట్ సెట్టింగ్‌ను తగ్గించడానికి ప్రయత్నించండి. బ్లో-డ్రైయింగ్ లేదా స్టైలింగ్‌కు ముందు హీట్ ప్రొటెక్టెంట్ ఉత్పత్తులను అప్లై చేసుకోవచ్చు.
ఎక్కువగా దువ్వకండి..
కొందరు జుట్టును ఊరికే దువ్వుతూ ఉంటారు. అన్ని సార్లు దువ్వితే.. చివర్లు చిట్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది. మీ జుట్టును బ్రష్ చేస్తున్నప్పుడు లేదా గట్టిగా లాగడం మానుకోండి. మీరు చిక్కును వదిలించుకునేందుకు.. హెయిర్ సీరమ్‌ను వాడండి.
సిల్క్ పిల్లోకేస్ మీద పడుకోండి
రాత్రిపూట మీ జుట్టును రక్షించుకోవడం వల్ల చివర్లు చీలిపోవడాన్ని కూడా నివారించవచ్చు. రాపిడిని తగ్గించడానికి కాటన్ పిల్లోకేస్‌పై పడుకునే బదులు.. పట్టు లేదా శాటిన్ పిల్లోకేస్‌పై పడుకోండి. ఇది జుట్టు దెబ్బతినకుండా, విరిగిపోకుండా కాపాడుతుంది.
స్ప్లిట్ చివరలను రిపేర్ చేయడానికి మార్గం లేనప్పటికీ.. మీరు నష్టాన్ని తక్కువగా చేసుకునేందుకు కొబ్బరి నూనె, బాదం నూనె లేదా మరొ రకమైన మాయిశ్చరైజర్‌ను మీ జుట్టు చివర్లకు అప్లై చేయవచ్చు. ఇవి మీ జుట్టును మృదువుగా చేస్తాయి.
సంబంధిత కథనం