తెలుగు న్యూస్  /  Lifestyle  /  White Hair To Black Hair Eat These Foods Daily For Hair Growth

Hair Growth Food : జుట్టు పెరగట్లేదేంట్రా బాబు అనుకుంటున్నారా? ఈ ఆహారం తినండి

HT Telugu Desk HT Telugu

28 March 2023, 14:15 IST

  • Hair Growth Food Telugu : జుట్టు రాలడం అనేది చాలామందికి ఉన్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా.. సమస్యను ఎదుర్కొంటున్నారు. వాతావరణం కూడా దీనికి ఓ కారణం. మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. సరైన ఆహారం తింటే.. మీ జుట్టు పెరుగుతుంది.

జుట్టు పెరుగుదల ఫుడ్
జుట్టు పెరుగుదల ఫుడ్

జుట్టు పెరుగుదల ఫుడ్

జుట్టు రాలడం(Hair Loss), తెల్ల జుట్టు(White Hair) అనేది చాలామందికి ఉన్న సమస్య. పెరిగే జుట్టు కంటే.. రాలేదే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. చాలామంది తెల్లజుట్టుతో బాధపడుతుంటారు. దీనికి పోషకాహారం తీసుకోకపోవడం కూడా ఓ కారణం. మన వెంట్రుకలు(Hairs) బలంగా ఉండాలంటే.. మంచి ఆహారం తీసుకోవాలి. జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడేందుకు.. ప్రోటిన్ ఫుడ్ తీసుకోవాలి.

ఐరన్ తీసుకోవాలి

ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూర, మునగాకు కూర, కోడిగుడ్లలోని పచ్చనిసోన, మాంసం, కిస్మిస్, యాప్రికాట్స్, ఖర్జూరాలు, బ్రొకొలి, పప్పు దినుసులు తినాలి. ఇవి తింటే శిరోజాలు వేగంగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

బి-కాంప్లెక్స్

ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, మునగాకు, కోడిగుడ్లు, చికెన్, నట్స్, సీడ్స్ లో బి విటమిన్ సరిగా ఉంటాయి. ఇవి వెంట్రుకలతో మీరు పడే సమస్యల నుంచి బయటపడేస్తాయి. జుట్టు పెరిగేందుకు(Hair Growth) ఉపయోగపడతాయి.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్

చేపలు, కోడిగుడ్డు, వాల్ నట్స్ వంటి పదార్థాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జుట్టు పెరగడం, చర్మానికి(Skin) కూడా మంచిది.

విటమిన్ సి

శరీరానికి సుమారు 1000 మిల్లీగ్రాముల మోతాదులో నిత్యం విటమిన్ సి(Vitamin C) అందేలా చూడాలి. దీనిద్వారా వెంట్రుకలకు సమస్యల ఉండవు. ఉసిరి, జామ, రెడ్ క్యాప్సికం, మెులకెత్తిన విత్తనాలు, బ్రొకొలి, స్ట్రాబెర్రీలు, కివీలు తినాలి.

విట‌మిన్ డి కూడా ముఖ్యమే

విటమిన్ డి ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. రోజూ ఉదయం ఓ అరగంటసేపు సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. విటమిన్ దొరికే.. చేపలు, మాంసం, లివర్, కోడిగుడ్డు, తృణధాన్యాలు, పచ్చి బఠానీలు, రొయ్యలు, చీజ్, పాలను తీసుకోవాలి. సరైన ఆహారం(Food) తీసుకుంటే.. మీరు జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు.

దీర్ఘకాలం పాటు ఒత్తిడి(Stress)ని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టు(Hair)పై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం ప్రారంభిస్తుంది. మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.