Reduce Hair Loss Naturally : జుట్టు రాలుతుందా? ఇదిగో మీకోసం కొన్ని చిట్కాలు-how coconut bhringraj and onion reduce your hair loss know here details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How Coconut Bhringraj And Onion Reduce Your Hair Loss Know Here Details

Reduce Hair Loss Naturally : జుట్టు రాలుతుందా? ఇదిగో మీకోసం కొన్ని చిట్కాలు

HT Telugu Desk HT Telugu
Mar 26, 2023 01:33 PM IST

Reduce Hair Loss : ఈ కథనంలో ఆరోగ్యవంతమైన జుట్టును పొందడానికి మీకు సహాయపడే కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం. వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

జుట్టు రాలడం
జుట్టు రాలడం (unsplash)

Hair Loss Treatment : జుట్టు రాలడం అనేది స్త్రీ పురుషులిద్దరికీ ప్రధాన సమస్య. ఇది ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, సరైన పోషకాహారం లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల కావచ్చు. ఆయుర్వేద చికిత్స జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టును(Healthy Hair) పొందడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి మనం తెలుసుకుందాం.

కొబ్బరి నూనె(Coconut Oil) జుట్టు సంరక్షణలో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఇది లారిక్ యాసిడ్‌ను కలిగి ఉంటుంది. ఇది జుట్టులోకి చొచ్చుకుపోతుంది. మరోవైపు కరివేపాకులో(curry leaves) యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను(Hair Growth) ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కొంత కరివేపాకు వేయండి. మిశ్రమాన్ని చల్లబరిచాక.. మీ జుట్టుకు పెట్టండి. కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచి స్నానం చేయండి.

బృంగరాజ్ ఆయిల్ జుట్టు(bhringraj hair oil) పెరుగుదలను ప్రోత్సహించే లక్షణాలకు ప్రసిద్ధి చెందినది. బృంగరాజ్ మొక్క నుండి ఆయిల్ తీస్తారు. ఇందులో ఐరన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి, ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ, మూలాలను బలోపేతం చేస్తాయి. ఈ నూనెలో ఉసిరి, వేప వంటి ఇతర ఆయుర్వేద మూలికలు కూడా ఉన్నాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను మీ జుట్టుకు పెట్టుకుని.., మరుసటి రోజు ఉదయం కడిగేయండి.

ఉల్లిపాయ రసం(onion juice for hair) అనేది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న సహజ పద్ధతి. ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని కొబ్బరినూనె, మందార, కరివేపాకు వంటి ఇతర ఆయుర్వేద మూలికలతో కలిపి అప్లై చేయడం వల్ల కుదుళ్లకు పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. మీ జుట్టుకు పెట్టుకుని కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచండి.

ఉసిరి(Indian gooseberry).., ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను నిర్మించడంలో, ఆరోగ్యకరమైన జుట్టుకు సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి, కొద్దిగా ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్‌గా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి. మీరు కొబ్బరి నూనె(Coconut Oil)తో ఉసిరి పొడిని మిక్స్ చేసి జుట్టుకు మసాజ్ చేయవచ్చు.

గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా.. కథన ఇచ్చాం. ఏవైనా కొత్త పద్ధతులు, సూచనలను అనుసరించే ముందు, వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

WhatsApp channel

టాపిక్