Daughter Temple : కన్నతండ్రి ప్రేమ.. కుమార్తెకు గుడి.. నిత్యం పూజలు-father built temple for daughter in nellore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Father Built Temple For Daughter In Nellore

Daughter Temple : కన్నతండ్రి ప్రేమ.. కుమార్తెకు గుడి.. నిత్యం పూజలు

HT Telugu Desk HT Telugu
Nov 22, 2022 03:05 PM IST

Nellore Daughter Temple : కుమార్తెపై ఆ తండ్రికి ఎంతో ప్రేమ. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచారు. కానీ విధి వారి కుటుంబంతో ఆడుకుంది. కుమార్తె కన్నుమూసేలా చేసింది. ఆ తండ్రి తట్టుకోలేక పోయాడు. కుమార్తెకు గుడి కట్టేశాడు.

కుమార్తెకు గుడి
కుమార్తెకు గుడి

చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా కుమార్తెను పెంచాడు ఓ తండ్రి. ఏది అడిగినా.. కాదనకుండా ఇచ్చాడు. కన్నబిడ్డ సంతోషమే తన ఆనందంగా బతికాడు. వారిని చూసిన విధికి ఏం అనిపించిందో.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుమార్తెను తిరిగిరాని లోకాలకు పంపించింది. ఇక తండ్రి ఇంట్లో మిగత వాళ్లు ఉన్నా.. ఒంటిరిగా ఫీలయ్యేవాడు. తన కుమార్తె(Daughter)ను తన కళ్ల ముందే పెట్టుకోవాలనుకున్నాడు. కానీ చనిపోయిన మనిషి రాలేదు కదా.. తన బిడ్డ కోసం ఓ గుడి కట్టించాడు. నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు. నెల్లూరు(Nellore) జిల్లాలోని ఈ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని నెల్లూరు జిల్లాలో కాకుటూరు గ్రామానికి వెళ్తే.. కుమార్తెకు గుడి ఉన్న ఇల్లు కనిపిస్తుంది. అందులో పూజలు చేస్తూ.. ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆయన ఎవరో కాదు.. కంటికిరెప్పలా కాపాడుకున్న కుమార్తెను కోల్పోయిన తండ్రి చెంచయ్య. కుమార్తె మరణానంతరం ఆమె ప్రతిరూపాన్ని ఉంచి ఆమెను దేవతగా పూజిస్తున్నాడు.

కాకుటూరు గ్రామానికి చెందిన చెంచయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. నాల్గొ కుమార్తె సుబ్బలక్ష్మమ్మ.. డిగ్రీ(Degree) పూర్తి చేసి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌(Forest Department)లో ఉద్యోగంలో చేరింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. ఊరి వాళ్లు కూడా.. తమ గ్రామానికి చెందిన బిడ్డ మంచి ఉద్యోగంలో సెటిల్ అయింది అనుకున్నారు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. 2011లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో సుబ్బలక్ష్మమ్మ ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ అంటే చెంచయ్యకు చాలా ఇష్టం. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. గ్రామంలో ఆమె జ్ఞాపకార్థం గుడి కట్టించాడు.

ఇప్పుడు, వారి ఇంటికి చాలా మంది వస్తుంటారు. ఓ పుణ్యక్షేత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాంతంలోని అనేక మంది కుమార్తె ఆలయాన్ని సందర్శిస్తారు. ఆమె వర్ధంతి సందర్భంగా ప్రార్థనలు కూడా చేస్తారు. కుమార్తె జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించాలనే తన ఆలోచనకు కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారని తండ్రి చెబుతున్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు పూజలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చాలా రోజుల నుంచి కుటుంబ సభ్యులు ఆమెకు పూజలు చేస్తున్నారు.

IPL_Entry_Point