Veg butter chicken : ఇది.. 100 పర్సెంట్ 'వెజ్ బటర్ చికెన్'- నెటిజన్లు షాక్!
Veg butter chicken : బటర్ చికెన్‌కు ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంటుంది. చాలా మంది నాన్‌వెజ్ ప్రియులు ఈ బటర్ చికెన్‌ను 'ఆహా' అనుకుంటూ ఆరగించేస్తారు. మరి మీరు ఎప్పుడైనా ‘100శాతం వెజ్ బటర్ చికెన్’ చూశారా? ఓ రెస్టారెంట్ దీనిని విక్రయిస్తోంది..
Veg butter chicken : ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లు.. కస్టమర్లను ఆకర్షించేందుకు ఎంత దూరమైనా వెళుతున్నాయి. ఇందులో భాగంగానే రకరకాల కొత్త, వింత వంటకాలు పుట్టుకొస్తున్నాయి. అవి కొన్నిసార్లు హిట్ అయితే.. ఇంకొన్ని సార్లు బెడిసి కొడతాయి. ఇలా బెడిసి కొట్టేవి.. ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటిదే ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ డిష్ పేరే.. "100 పర్సెంట్ వెజ్ బటర్ చికెన్". బటర్ చికెన్ ఏంటీ.. 100శాతం వెజ్ ఏంటి? అని షాక్ అవుతున్నారా? చాలా మందిది ఇదే పరిస్థితి.. అసలు మాటర్ ఏంటంటే..
100శాతం వెజ్ బటర్ చికెన్..
ఓ మహిళ.. ఏదో ఆర్డర్ ఇవ్వడానికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ను ఓపెన్ చేసింది. ఓ రెస్టారెంట్ మెన్యూను ఓపెన్ చేసింది. నాన్ వెజ్ మెన్యూ సెలక్ట్ చేసింది. అప్పుడే ఆమె షాక్ అయ్యింది. నాన్ వెజ్ మెన్యూ రికమెండేషన్లో "100శాతం వెజ్ బటర్ చికెన్" వచ్చింది. దానిని స్క్రీన్ షాట్ తీసిన ఆ మహిళ.. ట్విట్టర్లో ట్వీట్ చేసింది. "స్పాట్. వాట్స్ వ్రాంగ్ (ఇందులో తప్పేంటో కన్నుక్కోండి)" అని క్యాప్షన్ ఇచ్చింది.
Veg butter chicken viral tweet : ఈ ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. దాదాపు 40వేల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.
"ఇది ప్లాంట్ బేస్డ్ మీట్ అయ్యుండొచ్చు," అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. "వేగన్ అన్న పదం వాడకుండా మంచి ట్రిక్ ఇది" అని ఇంకొకరు రాసుకొచ్చారు. "ఇదేదో వెజ్ బిర్యానీలాగా ఉందే" అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. "బటర్ అనేది వెజ్. చికెన్ నాన్ వెజ్. అందుకే 100శాతం వెజ్ బటర్ చికెన్ అని రాసుంటారు," అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
100 percent Veg butter chicken : "చికెన్‌ను వెజిటేరియన్‌గా భావించి ఉంటారు. అందుకే అది 100శాతం వెజ్ బటర్ చికెన్ అయ్యింది," ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. "ఇక నుంచి చేపలు, చికెన్‌ని కూడా వెజిటేరియన్‌గా పరిగణించడం మొదలుపెడదాము," అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ట్వీట్‌ను ఇక్కడ చూడండి :
సంబంధిత కథనం