Khushbu Sundar: పాత ట్వీట్ తో ఇరుకున పడిన నటి ఖుష్బూ; వైరల్ చేస్తున్న కాంగ్రెస్-on old pm modi tweet khushbu sundar tells cong how more desperate ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Khushbu Sundar: పాత ట్వీట్ తో ఇరుకున పడిన నటి ఖుష్బూ; వైరల్ చేస్తున్న కాంగ్రెస్

Khushbu Sundar: పాత ట్వీట్ తో ఇరుకున పడిన నటి ఖుష్బూ; వైరల్ చేస్తున్న కాంగ్రెస్

HT Telugu Desk HT Telugu
Mar 25, 2023 09:15 PM IST

Khushbu Sundar old tweet: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), బీజేపీల మధ్య వివాదం నటి, బీజేపీ నేత ఖుష్బూ (Khushbu Sundar) ను ఇరుకున పెడుతోంది. ప్రధాని మోదీ (PM Modi) ని విమర్శిస్తూ, గతంలో ఆమె చేసిన ట్వీట్ ను ఇప్పుడు కాంగ్రెస్ వైరల్ చేస్తోంది.

నటి, బీజేపీ నేత ఖుష్బూ
నటి, బీజేపీ నేత ఖుష్బూ (Ayush Sharma)

Khushbu Sundar old tweet: ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ఐదేళ్ల క్రితం, 2018లో ప్రధాని మోదీ (PM Modi)ని తీవ్రంగా విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారు. అప్పుడు ఆమె కాంగ్రెస్ (congress) లో ఉన్నారు. 2020లో ఆమె కాంగ్రెస్ ను వీడి బీజేపీ (BJP) లో చేరారు. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ (NCW) సభ్యురాలిగా ఉన్నారు. మోదీ (PM Modi) అంటేనే అవినీతి అని అర్థమొచ్చేలా ఖుష్బూ 2018లో చేసిన ట్వీట్ ను కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నాయి.

Khushbu Sundar old tweet: ఏముందా ట్వీట్ లో..

కాంగ్రెస్ (congress) నాయకురాలిగా ఉన్న సమయంలో ఖుష్బూ (Khushbu Sundar) ఆ ట్వీట్ చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీల అవినీతి బట్టబయలైన సమయంలో ఆమె ఆ ట్వీట్ చేశారు. ‘‘అక్కడ మోదీ, ఇక్కడ మోదీ, ఎక్కడ చూసినా మోదీనే. కానీ, ఇదేంటి? ప్రతీ మోదీ ముందు అవినీతి అనే ఇంటిపేరే కనిపిస్తోంది?.. అంటే ఏంటి? అర్థం చేసుకోండి. మోదీ అంటేనే అవినీతి అని అర్థం. ఇప్పుడు మోదీ అనే మాటకు అర్థం అవినీతి అని మార్చాల్సిన సమయం వచ్చింది’’ అని ఖుష్బూ (Khushbu Sundar) హిందీలో ఆ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ కాంగ్రెస్ వారికి ఊహించని ఆయుధంలా అందివచ్చింది. ఆ ట్వీట్ ను కాంగ్రెస్ (congress) నేత దిగ్విజయ్ సింగ్ రీ ట్వీట్ చేస్తూ, మీ పార్టీ నాయకురాలైన ఖుష్బూ పై కూడా పరువునష్టం కేసు వేస్తారా? అని ప్రధాని మోదీని (PM Modi) ప్రశ్నించారు.

Khushbu Sundar old tweet: ఇంకేం చేయగలరు..

తన పాత ట్వీట్ వైరల్ కావడం, అది తన ప్రత్యర్థి పార్టీకి ఆయుధంగా మారడంపై నటి, బీజేపీ నేత ఖుష్బూ (Khushbu Sundar) స్పందించారు. కాంగ్రెస్ (congress) వారికి ఇంతకన్నా ఏం చేతనవుతుందని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ (congress) పార్టీలో ఉన్న సమయంలో, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా, పార్టీ పాలసీ మేరకు అలా ట్వీట్ చేశానని వివరణ ఇచ్చారు. అవినీతి అనడానికి, దొంగ అనడానికి తేడా ఉందని, ధైర్యం ఉంటే తనపై కేసు వేయాలని సవాలు చేశారు.

IPL_Entry_Point