New Year's Dishes । ప్రపంచంలోని పాపులర్ న్యూ ఇయర్ వంటకాలు ఇవే.. మీ మెన్యూలో ఉన్నాయా మరి!-new year s dishes from around the world you need to add to your party menu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  New Year's Dishes । ప్రపంచంలోని పాపులర్ న్యూ ఇయర్ వంటకాలు ఇవే.. మీ మెన్యూలో ఉన్నాయా మరి!

New Year's Dishes । ప్రపంచంలోని పాపులర్ న్యూ ఇయర్ వంటకాలు ఇవే.. మీ మెన్యూలో ఉన్నాయా మరి!

Dec 28, 2022, 03:03 PM IST HT Telugu Desk
Dec 28, 2022, 03:03 PM , IST

New Year's Dishes: వేడుకలు చేసుకునే సీజన్ వచ్చేసింది. న్యూ ఇయర్ సంబరాల్లో మునిగి తేలేందుకు జనం సిద్ధమవుతున్నారు. మీరు పార్టీని హోస్ట్ చేస్తుంటే మీ కొత్త సంవత్సర వేడుకల మెనూలో చేర్చాల్సిన ప్రపంచంలోని కొన్ని ఉత్తమ ఆహార పదార్థాల జాబితా ఇక్కడ చూడండి.

జపాన్  సోబా నూడుల్స్ నుండి ఐర్లాండ్ బటర్ బ్రెడ్ వరకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు రుచికరమైన న్యూ ఇయర్ వంటకాలు ఇక్కడ తెలుసుకోండి. 

(1 / 6)

జపాన్  సోబా నూడుల్స్ నుండి ఐర్లాండ్ బటర్ బ్రెడ్ వరకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు రుచికరమైన న్యూ ఇయర్ వంటకాలు ఇక్కడ తెలుసుకోండి. (Unsplash)

 రోస్కా డి రేయెస్, మెక్సికో: ఇది మెక్సికో దేశంలోని సాంప్రదాయమైన స్వీట్ బ్రెడ్, ఈ వంటకం ఐరోపా నుండి 150 సంవత్సరాల క్రితం మెక్సికోకు వచ్చింది. 

(2 / 6)

 రోస్కా డి రేయెస్, మెక్సికో: ఇది మెక్సికో దేశంలోని సాంప్రదాయమైన స్వీట్ బ్రెడ్, ఈ వంటకం ఐరోపా నుండి 150 సంవత్సరాల క్రితం మెక్సికోకు వచ్చింది. (Pixabay)

వాసిలోపిటా, గ్రీస్: సెయింట్ బాసిల్ ను స్మరించుకుంటూ  నూతన సంవత్సరం రోజు రాత్రికి ప్రత్యేకంగా వడ్డించే సాంప్రదాయమైన కేక్. ఈ కేకులో ఒక బంగారు నాణేన్ని దాచి ఉంచుతారు. ఆ నాణెం ఎవరికైతే లభిస్తుందో వారికి ఆ ఏడాదంతా  అదృష్టం కలిసివస్తుందని అక్కడి జనాల నమ్మకం. 

(3 / 6)

వాసిలోపిటా, గ్రీస్: సెయింట్ బాసిల్ ను స్మరించుకుంటూ  నూతన సంవత్సరం రోజు రాత్రికి ప్రత్యేకంగా వడ్డించే సాంప్రదాయమైన కేక్. ఈ కేకులో ఒక బంగారు నాణేన్ని దాచి ఉంచుతారు. ఆ నాణెం ఎవరికైతే లభిస్తుందో వారికి ఆ ఏడాదంతా  అదృష్టం కలిసివస్తుందని అక్కడి జనాల నమ్మకం. (Unsplash)

బటర్డ్ బ్రెడ్, ఐర్లాండ్: ఐర్లాండ్‌లో ప్రజలు బ్రెడ్, వెన్నతో విందు చేస్తూ తమ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇది కొత్త సంవత్సరాల ప్రారంభ రోజును జరుపుకునే పాత ఐరిష్ ఆచారం.

(4 / 6)

బటర్డ్ బ్రెడ్, ఐర్లాండ్: ఐర్లాండ్‌లో ప్రజలు బ్రెడ్, వెన్నతో విందు చేస్తూ తమ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇది కొత్త సంవత్సరాల ప్రారంభ రోజును జరుపుకునే పాత ఐరిష్ ఆచారం.(Unsplash)

aసోబా నూడుల్స్, జపాన్: కొత్త సంవత్సరం సందర్భంగా సోబా నూడుల్స్ (బుక్‌వీట్ నూడుల్స్) తినడం జపాన్ దేశంలో 13వ లేదా 14వ శతాబ్దానికి ముందే ప్రారంభమైంది. ఇది బాగా స్థిరపడిన సంప్రదాయం, ఈ నూడుల్స్ న్యూ ఇయర్ రోజున తింటే ఆ ఏడాదంతా అదృష్టాన్ని తెస్తుందని అక్కడి వారి నమ్మకం. 

(5 / 6)

aసోబా నూడుల్స్, జపాన్: కొత్త సంవత్సరం సందర్భంగా సోబా నూడుల్స్ (బుక్‌వీట్ నూడుల్స్) తినడం జపాన్ దేశంలో 13వ లేదా 14వ శతాబ్దానికి ముందే ప్రారంభమైంది. ఇది బాగా స్థిరపడిన సంప్రదాయం, ఈ నూడుల్స్ న్యూ ఇయర్ రోజున తింటే ఆ ఏడాదంతా అదృష్టాన్ని తెస్తుందని అక్కడి వారి నమ్మకం. (Unsplash)

బ్లాక్-ఐడ్ పీస్, దక్షిణ అమెరికా:  కొత్త ఏడాది ప్రారంభం రోజున దక్షిణ అమెరికాలో అలసందలతో చేసిన వంటకాన్ని ఆకుకూరలు, మొక్కజొన్న రొట్టెలతో కలిపి తింటారు. ఇది వారికి అదృష్టాన్ని తెస్తుందని నమ్మకం. 

(6 / 6)

బ్లాక్-ఐడ్ పీస్, దక్షిణ అమెరికా:  కొత్త ఏడాది ప్రారంభం రోజున దక్షిణ అమెరికాలో అలసందలతో చేసిన వంటకాన్ని ఆకుకూరలు, మొక్కజొన్న రొట్టెలతో కలిపి తింటారు. ఇది వారికి అదృష్టాన్ని తెస్తుందని నమ్మకం. (Instagram/@bowlofdelicious)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు