New Year Party Ideas At Home । పార్టీ లేదా పుష్పా.. ఇంట్లోనే ఇలా గ్రాండ్‌గా న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చు!-best ways to celebrate new year s eve party at home alone or with friends family ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Party Ideas At Home । పార్టీ లేదా పుష్పా.. ఇంట్లోనే ఇలా గ్రాండ్‌గా న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చు!

New Year Party Ideas At Home । పార్టీ లేదా పుష్పా.. ఇంట్లోనే ఇలా గ్రాండ్‌గా న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చు!

HT Telugu Desk HT Telugu
Dec 28, 2022 11:37 AM IST

New Year's Eve Party At Home: ఎక్కడికో వెళ్లడం ఎందుకు, ఇంట్లోనే గొప్పగా ఎందో వినోదభరితంగా నూతన సంవత్సర వేడుకలు ఎలా జరుపుకోవచ్చో ఇక్కడ ఐడియాలు ఉన్నాయి చూడండి.

New Year's Eve Party At Home
New Year's Eve Party At Home (Unsplash)

నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు ఉండే హడావిడి బహుశా వేరే ఏ పార్టీకి కూడా ఉండకపోవచ్చు. ఇప్పటికే అందరూ తమ డిసెంబర్ 31 వేడుకలపై బుకింగ్స్ పూర్తి చేసుకొని ఉంటారు. కొందరు ఇండియాలో, మరికొందరు ఫారెన్ వెళ్లి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని సిద్ధం అవుతున్నారు. అయితే వేడుకల్లో హుషారుగా పాల్గొనాలని అందరికీ ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం వలన కొందరికీ సాధ్యం కాదు. అలాంటపుడు వేడుక చేసుకునేందుకు ఎక్కడో ఎందుకు మీ ఇంట్లో గ్రాండ్‌గా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవచ్చు. కొత్త సంవత్సరానికి ఫుల్ ఎనర్జీతో స్వాగతం పలకవచ్చు.

ఇంట్లో న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటే కొన్ని సౌలభ్యాలు కూడా ఉన్నాయి. మీకు అయ్యే ఖర్చు చాలా తగ్గుతుంది, ఇంట్లో మీకు నచ్చినట్లుగా ఉండవచ్చు. పార్టీ తర్వాత చాలా అలసటగా ఉంటుంది, పార్టీ కోసం ఎక్కడికో వెళ్లడం ఒక పెద్ద టాస్క్ అయితే, అక్కడ్నించి తిరిగి రావడం పెద్ద రిస్క్. అదే ఇంట్లో అయితే ఎంత రాత్రైనా ఎలాంటి చింత ఉండదు, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. మరి ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు మీరు సిద్ధమేనా?

New Year's Eve Party At Home- ఇంట్లోనే న్యూ ఇయర్ పార్టీ

ఇంట్లో మీ కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితుల నడుమ నూతన సంవత్సర వేడుకలు వినోదాత్మకంగా, ఉల్లాసంగా జరుపుకోవడానికి ఇక్కడ మీకు కొన్ని ఉపాయాలు అందిస్తున్నాం. మీ స్నేహితులను, వారి కుటుంబ సభ్యులను మీ ఇంటికే పిలవండి. అందరూ కలిసి ఆనందంగా, గొప్పగా వేడుక చేసుకోండి.. చెలరేగిపోండి.

ఇంటికి డెకొరేషన్

ముందుగా పార్టీ కోసం మీ ఇంటిని డెకొరేట్ చేయండి. డెకొరేషన్ అనేది లేకపోతే పార్టీ మూడ్ ఉండదు. కలర్ ఫుల్ లైటింగ్స్, వాల్ పేపర్స్, బ్యానర్స్ మొదలైన వాటితో మీరు పార్టీ చేసుకోవాలనే గదులను, బాల్కనీలను డెకొరేట్ చేసుకోండి. అలాగే రాత్రి కట్ చేయడానికి కేక్, వీలైతే కొన్ని క్రాకర్స్ కూడా కొనుగోలు చేయండి.

డిన్నర్- డ్రింక్స్

పార్టీ కోసం మంచి స్టార్టర్స్ అవసరం, మీకు నచ్చిన స్టార్టర్స్ అలాగే మీకు నచ్చిన ఆహారాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. అలాగే డ్రింక్స్ లేకుండా ఏ పార్టీలో జోష్ ఉండదు. కాబట్టి అందరికీ అన్ని రకాలుగా ఉండే వివిధ రకాల డ్రింక్స్ ను ముందస్తుగానే సిద్ధం చేసుకొని ఇంట్లో పెట్టుకోండి.

మ్యూజిక్- మూవీస్

మ్యూజిక్ లేకుండా పార్టీ చప్పగా సాగుతుంది. కాబట్టి చార్ట్ బస్టర్ పాటలను, డిజే మిక్స్ సాంగ్స్ అన్ని ఎంచుకొని వాటితో కనీసం 2-3 గంటల పాటు నిరాటంకగా సాగే ప్లేలిస్ట్ సిద్ధం చేసుకోండి. మ్యూజిక్ కంటే ముందు మీరు చూడని కొన్ని అద్భుతమైన సినిమాలను లిస్ట్ చేసి పెట్టుకోండి.

బోర్డ్ గేమ్స్

న్యూ ఇయర్ సాయంత్రాన అందరూ కలిసి క్యారమ్ బోర్డ్, స్నేక్ ల్యాడర్ లేదా మీకు నచ్చిన మరేవైనా బోర్డ్ గేమ్స్ ఆడటం, మూవీస్ చూస్తూ స్టార్టర్స్ ఆస్వాదిస్తూ, కబుర్లు చెప్పుకుంటూ మంచి సమయాన్ని గడపవచ్చు.

డ్రామా థీమ్

మామూలుగా పార్టీ చేసుకుంటే ఏమొస్తుంది. ఫ్యాన్సీ దుస్తులు వేసుకోండి. మీకు నచ్చిన ఏదైనా మూవీ లేదా డ్రామాను ఎంచుకొని అందులోని క్యారెక్టర్ల లాగా తయారవ్వండి, మీ పేర్లతో కాకుండా మీరు ధరించిన క్యారెక్టర్ పేరుతోనే మాట్లాడుకోండి, ఏదైమా సినిమా స్క్రిప్టును ఫాలో అవుతూ నాటకం వేయండి.

కౌంట్‌డౌన్ టైమ్

డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు 2 నిమిషాల ముందు అలారం సెట్ చేసి పెట్టుకోండి. అంతకంటే 2 గంటల ముందు, మీ పార్టీని ప్రారంభించండి. లైట్స్ ఆఫ్ చేయండి, మ్యూజిక్ ఆన్ చేయండి, డిస్కోలైట్స్ ఏవైనా ఉంటే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఆపేవారెవరూ లేరు. అలార మోగినపుడు అలర్ట్ అయిపోయి, 12 అవగానే క్రాకర్స్ వెలిగించి, కేక్ కట్ చేసి, న్యూ ఇయర్ కు స్వాగతం చెప్పండి. హ్యాప్పీ న్యూ ఇయర్!

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్