తెలుగు న్యూస్  /  Lifestyle  /  Want To Get Glowing Skin Like Keerthy Suresh, Here Are The Secrets Behind Her Beauty

Keerthy Suresh Secrets | కీర్తి సురేష్‌లా ముఖంలో మంచి కళ రావాలా.. ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఇవిగో!

HT Telugu Desk HT Telugu

16 January 2023, 12:05 IST

    • Keerthy Suresh Beauty Secrets: కీర్తి సురేష్ సహజంగా, అందంగా కనిపిస్తుందంటే అందుకు కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? కీర్తి సురేష్ బ్యూటీ సీక్రెట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Keerthy Suresh Beauty Secrets
Keerthy Suresh Beauty Secrets (FB)

Keerthy Suresh Beauty Secrets

మహానటిగా ఎనలేని కీర్తి, ప్రతిష్టలు దక్కించుకున్న కీర్తి సురేష్ తన అభినయంలోనే కాదు, అందంలోనూ సహజత్వాన్ని ప్రదర్శిస్తుంది. సాంప్రదాయ చీరకట్టులో అయినా, మోడ్రన్ స్కర్టులో అయినా కీర్తి అందం, ఆమె ఫిజిక్ అద్భుతం అనిపిస్తుంది. ముఖంలో ఎల్లప్పుడూ విచ్చుకునే చిరునవ్వుతో, పెద్ద పెద్ద కళ్లతో ఆమె ముఖం ఎప్పుడూ ఎంతో కళగా కనిపిస్తుంది.

అయితే గ్లామర్ ప్రపంచంలో తరచుగా ముఖానికి మేకప్ వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇలా మేకప్ వేసుకోవడం వలన చర్మం దెబ్బతింటుంది, మొఖంలో జీవకళ తగ్గుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లోనూ కీర్తి సురేష్ అంతటి సహజ రూపాన్ని కలిగి ఉంటుందంటే ఆమె సౌందర్య రహస్యం ఏమై ఉంటుందా? అని అనుమానం కలగక మానదు. కీర్తి సురేష్ సౌందర్య రహస్యాలను మేము మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం.

Keerthy Suresh Beauty Secrets - కీర్తి సురేష్ సౌందర్య రహస్యాలు

కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది, అభిమానులతో ఎల్లప్పుడూ చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె తన చర్మ సంరక్షణ, ఫిట్‌నెస్, ఆరోగ్యానికి సంబంధించి అనేక అంశాలను నిరంతరం పంచుకుంటుంది. వాటి ఆధారంగా కీర్తి సురేష్ అందం వెనక రహస్యం ఏమిటో మీరూ తెలుసుకోండి మరి.

హైడ్రేటెడ్‌గా ఉండటం

కీర్తి సురేష్ ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తుంది. సమృద్ధిగా నీరు తాగటం, పళ్ల రసాలు తీసుకోవడం చేస్తుంది. ఇలా హైడ్రేటెడ్‌గా ఉండటం వలన శరీరంపై నిర్జలీకరణ ప్రభావాలు ఉండవు, మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు. ఇదే కీర్తి పాప మొదటి సౌందర్య రహస్యం.

యోగా సాధన

కీర్తి సురేష్ తన ఫిట్‌నెస్ కోసం, యోగా సాధనను ప్రధాన వ్యాయామంగా ఎంచుకుంటుంది. 'బయట ఉన్నవాటిని మనం నియంత్రించలేము, కానీ లోపల ఉన్న వాటిని మనం నియంత్రించగలము. అందుకు నేను కనుగొన్న ఒక మార్గం యోగా' అంటూ నటి తాను యోగా చేస్తున్న వీడియో పోస్టుకు ఈ రకంగా క్యాప్షన్ ఇచ్చారు. యోగా శారీరాక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, మనసును నియంత్రణలో ఉంచుకోవచ్చు, ఫిట్‌నెస్ సాధించవచ్చు. అందుకే కీర్తి ముఖంలో కాంతి, ఆమె ఫిజిక్ లో ఫిట్‌నెస్ కనిపిస్తాయి.

స్కిన్‌కేర్ రొటీన్‌

కీర్తి సురేష్ తన అందమైన చర్మం కోసం CTM చేయాలని సిఫారసు చేస్తుంది. దీని అర్థం క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అని. చర్మసంరక్షణ కోసం ఎల్లప్పుడూ ఇలాంటి కఠినమైన స్కిన్‌కేర్ రొటీన్‌ అనుసరించాలని, అవసరమైతే మీ చర్మ రకానికి తగినట్లుగా ఎలాంటి ఉత్పత్తులు వాడాలో కాస్మటాలజిస్టులను సంప్రదించాలని సూచిస్తుంది.

తక్కువ మేకప్

కీర్తి సురేష్ తన చర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి సహజ ఉత్పత్తులు, మాస్క్‌లను మాత్రమే ఉపయోగిస్తుంది. అంతేకాకుండా రసాయన ఉత్పత్తులకు బదులుగా సహజ ఉత్పత్తులకే తన ప్రాధాన్యత అని నొక్కి చెబుతుంది. మరీ ముఖ్యంగా తాను వేసుకునే మేకప్ చాలా సరళంగా ఉంటుంది. ఎక్కువ ఫౌండేషన్ లేకుండా కేవలం కన్సీలర్, బ్యూటీ బామ్ లేదా బ్లెమిష్ క్రీమ్ లను మాత్రమే ఉపయోగిస్తానని పలు సందర్భాల్లో తెలిపింది.

ఇవే, కీర్తి సురేష్ గ్లామర్ సీక్రెట్స్. మీ మొఖంలో కూడా మంచి సహజ కాంతిని, కళను కోరుకుంటే కీర్తి సురేష్ అనుసరించే చిట్కాలను అనుసరించవచ్చు.