తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Today Recipe | బ్రేక్​ఫాస్ట్ ఆర్ బ్రంచ్​.. వెజిటెబుల్​ ఫ్రైడ్​ రైస్​ పర్​ఫెక్ట్

Today Recipe | బ్రేక్​ఫాస్ట్ ఆర్ బ్రంచ్​.. వెజిటెబుల్​ ఫ్రైడ్​ రైస్​ పర్​ఫెక్ట్

HT Telugu Desk HT Telugu

01 June 2022, 8:26 IST

    • ఈ రోజు బ్రేక్ ఫాస్ట్​ని బ్రంచ్​తో మొదలుపెట్టాలనుకుంటన్నారా? దానిని కూడా హెల్తీగా తీసుకోవాలంటే వెజిటెబుల్స్ కూడా ఉండాలనుకుంటున్నారా? అయితే దానిని ఎలా చేయాలో అని కంగారు పడకండి. ఈ వెజిటెబుల్ ఫ్రైడ్​ రైస్​ను ప్రయత్నించి.. డే స్టార్ట్ చేసేయండి.
వెజిటెబుల్ రైస్
వెజిటెబుల్ రైస్

వెజిటెబుల్ రైస్

Vegetable Fried Rice | ఒక్కోసారి ఉదయాన్నే ఏమి తినాలని అనిపించదు. కానీ లంచ్​కి, బ్రేక్​ఫాస్ట్​కి మధ్యలో ఆకలి వేసే అవకాశముంది. ఆ సమయంలో టిఫెన్ వండినా లంచ్ లేట్​ అయిపోతుంది. అలా అని లంచ్ పూర్తిగా అయ్యేవరకు ఆగలేము. ఆ సమయంలో వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్​ని చేసుకోండి. ఇది మీకు బ్రంచ్​కి పర్​ఫెక్ట్. అయితే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో.. వాటికి కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు:

* అన్నం - 2 కప్స్

* నూనె - 2 టేబుల్ స్పూన్లు

* వెల్లుల్లి రెబ్బలు - 2 (సన్నగా తరిగినవి)

* ఉల్లిపాయ -1 (సన్నగా తరిగిన)

* స్ప్రింగ్ ఆనియన్ - 4 టేబుల్ స్పూన్లు (తరిగిన)

* క్యారెట్ - 1 (సన్నగా తరిగిన)

* క్యాబేజీ - కొద్దిగా (సన్నగా తరిగినవి)

* బఠానీలు - 2 స్పూన్స్

* బీన్స్ - 5 (తరిగినవి)

* క్యాప్సికమ్ -1 (సన్నగా తరిగినది)

* ఉప్పు - తగినంత

* సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు

* వెనిగర్ - 1 టేబుల్ స్పూన్

* పెప్పర్ - 1 స్పూన్

తయారీ విధానం..

ముందుగా రైస్​ని ఉండికించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఫ్రైడ్ రైస్​ కోసం సిద్ధం కావాలి. ముందుగా ఒక పెద్ద కడాయిలో నూనెను వేడి చేసి.. వెల్లుల్లిని వేయించాలి. దానిలో ఉల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్ వేసి వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత.. క్యారెట్, క్యాబేజీ, బఠానీలు, బీన్స్, క్యాప్సికమ్ వేసి వేయించాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పువేస్తే కూరగాయలు త్వరగా ఉడుకుతాయి. అనంతరం దానిలో సోయాసాస్, వెనిగర్ వేయండి. సాస్ బాగా కలిసేలా కూరగాయలను కలపండి.

మంట ఎక్కువగా ఉంచి.. వండిన అన్నాన్ని దానిలో వేయండి. మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. అనం విరిగిపోకుండా జాగ్రత్తగా కలపాలి. అంతే వేడి వేడి వెజిటబుల్ రైస్ రెడీ. దీనిని రైతాతో సర్వే చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన కూరగాయాలే కాకుండా మీకు నచ్చిన వాటితో కూడా దీనిని తయారుచేసుకోవచ్చు. రాత్రి అన్నం మిగిలితే ఉదయం పారేయలేని వాళ్లు.. కూడా దీనిని తయారు చేసుకోవచ్చు.

 

టాపిక్