Breakfast | ఎనర్జీ కావాలన్నా.. హైడ్రేట్‌గా ఉండాలన్నా.. ఈ స్మూతీ పర్ఫెక్ట్
31 May 2022, 7:07 IST
- మీలో శక్తి తక్కువ ఉందా? ఇన్స్టాంట్ ఎనర్జీ కావాలా? అయితే ఈ స్మూతీ ట్రై చేయాల్సిందే. ఈ పవర్ఫుల్ స్మూతీలో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ కొవ్వులు, మంచి కార్బ్స్.. ఉంటాయి. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్తీ స్మూతీ
Breakfast Dairies | మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్మూతీ అయితే.. అది మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచితే.. పైగా వేసవిలో మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచితే.. అలాంటి దానిని ఎవరూ కాదనలేరు. అలాంటి స్మూతీ గురించే ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. వేసవిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. అందుకే నానబెట్టిన డ్రైఫ్రూట్స్, నట్స్, సీడ్స్‌తో మనం ఈ స్మూతీ తయారు చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీవిధానం ఇప్పుడు చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
* అరటి పండు - 1
* ఓట్స్ - 2 స్పూన్లు (నానబెట్టాలి.)
* ఎండు ద్రాక్ష - 8 (నానబెట్టాలి)
* అంజీర్ -1 (నానబెట్టాలి)
* పెరుగు - 100 గ్రాములు
* పల్లీలు - 1 స్పూన్ (వేయించినవి)
* గుమ్మడి గింజలు - 1 స్పూన్ (నానబెట్టాలి)
* చియాసీడ్స్ - 2 స్పూన్స్ (నానబెట్టాలి)
* వాల్నట్స్ - 4
తయారీ విధానం
అరటి పండు, ఓట్స్, ఎండు ద్రాక్ష, అంజీర్, పెరుగు, పల్లీలు, గుమ్మడి గింజలు అన్నింటిని మిక్సీ జార్లో వేసి.. స్మూతీగా చేసుకోవాలి. అనంతరం ఓ గ్లాసులో చియాసీడ్స్ వేసి.. దానిలో ఈ స్మూతిని వేయాలి. దానిపై వాల్‌నట్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. అంతే సింపుల్ అండ్ హెల్తీ స్మూతీ రెడీ. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకుంటే రోజంతా మీరు ఎనర్జిటిక్‌గా ఉంటారు. పైగా వేసవిలో రోజంతా హైడ్రేట్‌గా ఉంటారు.
దీనిలో మొత్తం 287 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ 11.1 గ్రాములు ఫైబర్ 4.4 గ్రాములు, మంచి కొవ్వు - 9 గ్రాములు, కార్బ్స్ 40 గ్రాములు ఉంటాయి. కాబట్టి దీనిని మీరు జిమ్ నుంచి వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు.