Appam Breakfast | అట్టు, దోశ కాదు.. అప్పం తినండి, ఆహా అంటారు!
30 May 2022, 8:36 IST
- అప్పం అనేది కేరళ స్టైల్లో తయారు చేసే ఒక అట్టు లాంటి వంటకం. దీనిని చట్నీ, కుర్మా, మాంసాహార కూరల్లో నంజుకొని తినొచ్చు. రెసిపీ ఇక్కడ తెలుసుకోండి..
Appam
అప్పం చూడటానికి దోశ లాగే ఉంటుంది కానీ దోశ కాదు. అయితే ఇది తెల్లని రంగులో మృదువుగా ఉండే ఒక అట్టు. అంచుల చుట్టూ సన్నగా, క్రిస్పీగా ఉంటుంది. దీనిని పాలప్పం అని కూడా అంటారు. ఇది కేరళ వంటకాలలో చాలా పాపులర్. బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ సమయంలోనూ ఎప్పుడైనా తీసుకోవచ్చు. చట్నీతో, వెజిటేబుల్ కూరతో, మాంసాహార వంటకాలలో అద్దుకొని తినవచ్చు.
దీనిని పులియబెట్టిన బియ్యం, కొబ్బరి పాలు లేదా పచ్చి కొబ్బరి తురుమును కలిపి తయారు చేస్తారు. తయారీ అనేది దోశ పిండిని తయారు చేయడం మాదిరిగానే ఉంటుంది అయితే ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ అవసరం.
సాంప్రదాయం ప్రకారం అయితే అప్పంను తాటి కల్లుతో, కొబ్బరి పువ్వు కల్లుతో కలిపిచేస్తారు. అలా ఇష్టం లేనివారు నీరు కలిపి ఒకరోజు ముందు పులియబెడతారు లేదా అప్పటికప్పుడు ఈస్ట్ కలిపి పులియబెడతారు.
ఈ అప్పం చేయడానికి, నేను కొబ్బరి పాలకు బదులుగా పిండిని రుబ్బుతున్నప్పుడు తాజా తురిమిన కొబ్బరిని జోడించాలని నిర్ణయించుకున్నాను. మీరు తురిమిన కొబ్బరికి బదులుగా కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు - సుమారు 1 కప్పు చిక్కటి కొబ్బరి పాలు సరిపోతుంది.
కావాల్సినవి
- 1 ½ కప్పుల బియ్యం
- ½ కప్ తాజా కొబ్బరి తురుము
- పావు కప్పు అటుకులు
- ½ టీస్పూన్ ఉప్పు
- 2 టేబుల్ స్పూన్ల చక్కెర
- నూనె అట్టులాగా వేసుకోవడానికి
తయారీ విధానం
1. ముందుగా బియ్యాన్ని (సాధారణ సోనా మసూరి, కొల్లాం రకం బియ్యం) నీటిలో కొన్ని సార్లు కడిగి వేయండి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లతో బియ్యాన్ని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలి. మూతపెట్టి ఉంచాలి.
2. నీటిని తీసివేసి నానబెట్టిన బియ్యాన్ని గ్రైండర్ కూజాలో వేసి మిక్స్ చేయండి. ఇందులో. తురిమిన తాజా కొబ్బరి, అటుకులు, ఉప్పు, టేబుల్ వేసి మిక్స్ చేయండి. అవసరం మేరకు నీళ్లు పోసుకుంటూ అట్లు వేసేలా మెత్తటి బ్యాటర్ తయారు చేసుకోండి.
2A. ఇలా కాకుండా.. మరొక విధానంలో పైన పదార్థాలను గ్రైండర్ కూజాలో మిక్స్ చేసి, నీళ్లు పోసుకుంటూ మెత్తటి పిండి లాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిలో అర టీస్పూన్ ఈస్ట్ కలిపి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. వాతావరణం వేడిగా ఉంటే గంట చాలు.
3. బోలుగా ఉన్న పాన్‌పై అర టీస్పూన్ నూనెను చిలకరించి పాన్ వేడి చేయాలి. ఆపై అట్టులాగా వేసుకోవాలి. ఇదే అప్పం.