తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Turkish Breakfast | ఎప్పుడు ఒకేలా ఎందుకు, ఈ ఆదివారం టర్కిష్ బ్రేక్‌ఫాస్ట్ చేయండి

Turkish Breakfast | ఎప్పుడు ఒకేలా ఎందుకు, ఈ ఆదివారం టర్కిష్ బ్రేక్‌ఫాస్ట్ చేయండి

HT Telugu Desk HT Telugu

29 May 2022, 9:50 IST

google News
    • ఆదివారం రోజు ఏదైనా ప్రత్యేకమైన బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? టర్కిష్ ఎగ్స్ రెసిపీని ప్రయత్నించండి. ఇదివరకు మీరు ఎప్పుడూ టర్కిష్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఉండకపోవచ్చు. 
Turkish Egg Recipe
Turkish Egg Recipe (Pixabay)

Turkish Egg Recipe

ఆదివారం ఆలస్యంగా లేస్తాము. అలాగే పనులు చేసుకోవడానికి తగిన సమయం కేటాయించుకోగలుగుతాం. మరి బ్రేక్‌ఫాస్ట్ సంగతేంటి? వారం మొత్తం ఉరుకుల పరుగుల జీవితంలో దొరికింది తినేసి, మెల్లగా ఎలాగో అలా బ్రతికేస్తున్నపుడు.. కనీసం వారంలో ఒక్కసారైనా మనకోసం మనకు ఇష్టమైంది చేసుకొని తినడంలో తప్పులేదు. అలాగే కొత్తగా ఏదైనా ప్రయత్నించడం ద్వారా పోయేది ఏమి లేదు.

ఆదివారం లంచ్ అయినా, బ్రేక్‌ఫాస్ట్ అయినా ప్రత్యేకంగా ఉండాలి. అందుకే మీకోసం స్పెషల్ కాంటినెంటల్ కుసీన్ నుంచి టర్కిష్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తీసుకొచ్చాం. టర్కిష్ ఎగ్స్ బ్రేక్ ఫాస్ట్ ఆదివారం రోజున పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్. దీనిని ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ అందించారు.

చూడటానికి తెలిసిన వంటకం లాగే ఉంది కానీ, తయారు చేసే విధానం పూర్తిగా విభిన్నం. మరి 'టర్కిష్ ఎగ్స్' కు కావాల్సిన పదార్థాలేమిటి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

టర్కిష్ ఎగ్స్ బ్రేక్‌ఫాస్ట్ కోసం కావాల్సినవి

  • 2 - గుడ్లు
  • 1 కప్పు - చిక్కటి యోగర్ట్/ పెరుగు
  • 2-3 - వెల్లుల్లి రెబ్బలు
  • 3-4 టేబుల్ స్పూన్లు - వెన్న
  • 1 టేబుల్ స్పూన్ - ఆలివ్ నూనె
  • 1 ½ టీస్పూన్ - రెడ్ చిల్లీ ఫ్లేక్స్
  • 1 స్పూన్ - నిమ్మరసం
  • ఉప్పు రుచికి తగినంత
  • గార్నిషింగ్ కోసం సోయా ఆకులు లేదా కొత్తి మీర
  • టోస్ట్ బ్రెడ్

తయారీ విధానం

ఇందులో ఒక్కక్కటి ప్రత్యేకంగా చేసుకోవాల్సి ఉంటుంది.

  1. ముందుగా యోగర్ట్ తీసుకొని అందులో వెల్లుల్లిని తురుముకొని వేసుకోవాలి. ఆపై చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మృదువైన పేస్టులాగా కలుపుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి.
  2. రెండో దశలో ఒక పాన్ లో వెన వేసి వేడిచేయాలి. వెన్న కరిగి గోధుమ రంగు ద్రావణంలా మారేంత వరకు వేడిచేయాలి. ఈ కరిగిన వెన్నలో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె వేయాలి, బాగా కలిపిన తర్వాత ఈ ద్రావణంలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
  3. మూడో దశలో ఒక గిన్నెలో నీటిని వేడిచేయాలి. నీరు వేడయ్యాక అందులో గుడ్లు పగలగొట్టి పోయాలి. ఆ తర్వాత నిమ్మరసం పిండాలి. గుడ్లు కొద్దిగా ఉడకగానే జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి.
  4. చివరి దశలో మొదటగా చేసుకున్న యోగర్ట్ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో కింద బేస్ లాగా పరుచుకోవాలి. దానిపైన నీటిలో ఉడికించిన గుడ్డును వేసుకోవాలి. ఇప్పుడు స్పైసీ బటర్ సాస్ ని గుడ్డుపైన చల్లుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవాలి.

టర్కిష్ ఎగ్స్ రెడీ అయినట్లే బ్రెడ్ లేదా టోస్టుతో కలిపుకొని ఈ వంటకాన్ని బ్రేక్ ఫాస్ట్ లాగా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది.

Turkish Breakfast- Video:

టాపిక్

తదుపరి వ్యాసం