తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Quick Breakfast Recipes | సూపర్ ఫాస్ట్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు ఇవిగో!

Quick Breakfast Recipes | సూపర్ ఫాస్ట్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

22 May 2022, 9:51 IST

    • ఈ ఆదివారం ఉదయం లేచి ఏదీ చేసుకోలేకపోతున్నారా? త్వరత్వరగా పది నిమిషాల్లోనే సిద్ధం చేసుకునే ఈ బ్రేక్ ఫాస్ట్ ఐడియాలను ఒకసారి గమనించండి, మీ మూడ్ మారిపోతుంది.
    • సూపర్ ఫాస్ట్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు
Quick Breakfast Recipes
Quick Breakfast Recipes (Unsplash)

Quick Breakfast Recipes

ఆదివారం రోజు ఇంకాస్త ఎక్కువసేపు నిద్రపోవాలని ఎవరికి ఉండదు? చాలా మందికి సెలవు రోజుల్లో చాలా బద్దకంగా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించదు, సోమరిగా మారిపోతారు. కానీ కడుపులో నుంచి ఆకలికేకలు వినిపిస్తాయి. త్వరగా లేచి కడుపులో ఏదైనా పడేయమని కడుపు వేడుకుంటుంది. కాబట్టి ఆలస్యంగా లేచిన తర్వాత మనకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని, అప్పుడు టిఫిన్ చేసుకుంటే ఏం లాభం? బిర్యానీ తినాల్సిన టైంలో పులిహోరా తింటే మనసు ఒప్పదు కదా? అందుకే సులభంగా, త్వరితగతిన సిద్ధం చేసుకునే అల్పాహారాలు మీ ముందు ఉంచుతున్నాం. వీటిలో మీకు నచ్చినవి ఎంచుకొని త్వర త్వర త్వరగా చేసుకొని తినేయండి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు

Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

సమయం లేదు మిత్రమా.. కేవలం పదే పది నిమిషాల్లో సిద్ధం చేసుకొనే కొన్ని బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు ఇవే.

పీనట్ బటర్ టోస్ట్: 

బ్రెడ్ మీద కొంచెం పీనట్ బటర్, జెల్లీ పరిచి కొన్ని నట్స్, ఇంకొన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటే కడుపు నిండిపోతుంది.

నైట్ ఓట్స్: 

సెలవు రోజు వస్తే ఆ ముందు రాత్రే కొన్ని పాలల్లో ఓట్స్, పండ్లు, నట్స్ వేసి రాత్రంతా ఫ్రిజ్‌లో నిల్వచేసి ఉంచండి. మరుసటి రోజు ఉదయం దాన్ని బయటకు తీసి ఆరగించండి. ఒకవేళ మీరు నైట్ నిల్వచేయకపోతే ఇప్పుడు కూడా పాలు వేడిచేసుకొని అందులో ఇవన్నీ వేసుకుని తింటే మీ బ్రేక్ ఫాస్ట్ సెట్.

అవోకాడో టోస్ట్: 

అవకాడోను మెత్తగా పేస్ట్ చేసి, టోస్ట్ మీద స్ప్రెడ్ చేసి, కొన్ని నట్స్ వేసి, కొంచెం ఉప్పుకారం వేసి ఆపై నంజుకొని తినండి.

స్మూతీ బౌల్స్: 

మీకు ఇష్టమైన పండ్లు లేదా కూరగాయలను తీసుకొని బ్లెండర్లో కొన్ని పాలు లేదా పెరుగు వేసుకొని మృదువుగా, మందమైన జ్యూస్ లాగా తయారుచేసుకొని ఆస్వాదించండి.

చిల్లా: 

చిల్లా చేసుకోవడం చాలా తేలిక. ఏదైనా పిండిని తీసుకొని పాలల్లో కలపండి దోశపిండిలాగా చేసుకొని పెనం వేడిచేసి దోశలాగా వేసుకొండి, కొంచెం తేనే అద్దండి. చిల్లా సిద్ధం అయినట్లే. చిల్లా తినండి, చిల్ అవ్వండి.

ఎగ్ ఆమ్లెట్:

 ఇది సింపుల్, చాలా మందికి ఫేవరెట్ కూడా. రెండు గుడ్లు తీసుకొని ఆమ్లెట్ వేసి, ఆపై బ్రెడ్ వేసి అటుఇటు తిప్పితే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చేసుకొని తినేయ్ బడ్డీ.

టాపిక్