తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation | అతిగా ఆలోచించే వారు సుఖపడినట్లు చరిత్రలో లేదు..

Sunday Motivation | అతిగా ఆలోచించే వారు సుఖపడినట్లు చరిత్రలో లేదు..

HT Telugu Desk HT Telugu

22 May 2022, 6:30 IST

    • ఊహించుకోవడం అనేది ఓ గొప్పవరం ఎప్పుడంటే.. మనకి మంచి జరుగుతుందని ఊహించుకున్నప్పుడు. అదే ఊహించుకోవడమనేది.. మనల్ని అత్యంత చెత్త ప్రదేశాలకు తీసుకెళ్తుంది. అయ్యో ఇలా అయిపోతుందేమో అనే చింత మనలో మొదలవుతుంది. ఒక్కసారి మనలో చింత మొదలైందా.. మన సంతోషానికి ఎండ్​ కార్డ్ పడిపోయినట్టే.
ఆందోళన అవసరమా?
ఆందోళన అవసరమా?

ఆందోళన అవసరమా?

Sunday Motivation | ఆందోళన, ఊహల మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. ఇది మనల్ని చిక్కుల్లో పడేస్తుంది. ఊహలనేవి జీవితంలో అద్భుతాలు చేయగలవు.. అనర్థాలను సృష్టించగలవు. ఉదాహరణకు.. మనం టీవీ చూస్తున్నప్పుడు లేదా సినిమాకు వెళ్లినప్పుడు.. ఆ సినిమా జోనర్​కి సంబంధించిన ప్రదేశాలకు మన ఊహల్లో వెళ్లిపోతాము. హర్రర్​ అనుకోండి భయపడతాం. అలాగే మనం దేని గురించి అయితే ఎక్కువ ఊహించుకుంటామో దాని మీదనే మన సంతోషం ఆధారపడి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

నెగిటివ్ ఆలోచనలు..

మన ఊహలు అనేవి.. మనల్ని జీవితంలో గొప్ప, శక్తివంతమైన వారిగా మార్చాలే తప్పా... మన ఆలోచనలను అంధకారంలో పడేసివిగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మనల్ని ఉత్తమమైన మార్గంలో పయనించేలా సహాయం చేయాలి. ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకునేందుకు దృష్టిని వేరే వాటిపైకి మరల్చాలి. ధ్యానం అనేది ఇలాంటి సమస్యలకు మంచి పరిష్కారం ఇస్తుంది. నెగిటివ్ ఆలోచనలు బుర్రలోకి రాకుండా సహాయం చేస్తుంది.

మన ఊహలు చెడుగా ఉన్నప్పుడు ఫలితాలు కూడా చెడుగానే వస్తాయి. అనవసర విషయాలపై దృష్టి కేంద్రీకరించినప్పుడు.. ఈ విషయాలు జరగవచ్చనే ఆందోళన మనలో కూడా కలుగుతుంది. ఇది మనలను ఆందోళనకు కూడా గురిచేస్తుంది. అందుకే మన ఊహలను దుర్వినియోగం చేసుకోకూడదు. ముఖ్యంగా అనవసరమైన ఊహల గురించి ఆలోచించి.. చింతిస్తూ కుర్చోకూడదు. ఒకవేళ మనం ఊహించుకున్నట్లుగానే చెడు జరిగితే.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని.. ముందుకు సాగాలి. అంతే తప్పా ఏదో జరిగిపోయిందని చింతిస్తూ కుర్చోకూడదు. మీ ఆందోళనను విడిచిపెట్టి.. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తప్పనిసరిగా కృషి చేయాలి. ఇది మీ జీవితం. దానికి మంచి జరగాలని మీరు కోరుకోవాలి. అనవసరమైన ఆందోళనలు దరికి రాకుండా చూసుకోవాలి. ఉయోగకరమైన, ఆహ్లాదకరమైన విషయాలపై దృష్టి పెట్టడం వల్ల కచ్చితంగా మంచి జరుగుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం