తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flaxseed Ladoo Recipe : అవిసె గింజలతో ఇలా లడ్డూలు చేసేయండి.. అలా తినేయండి..

Flaxseed Ladoo Recipe : అవిసె గింజలతో ఇలా లడ్డూలు చేసేయండి.. అలా తినేయండి..

08 October 2022, 7:31 IST

    • Flaxseed Ladoo Recipe : అవిసె గింజల గురించి మనందరికీ తెలుసు. ఇవి మన ఆరోగ్యానికే కాదు.. మన జుట్టు సంరక్షణకు కూడా చాలా ముఖ్యమైనవి. అయితే వీటితో ఆరోగ్యకరమైన లడ్డూను తయారు చేసుకోవచ్చు. రోజూ పరగడుపున దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు చేకూరతాయి. 
అవిగింజల లడ్డూలు
అవిగింజల లడ్డూలు

అవిగింజల లడ్డూలు

Flaxseed Ladoo Recipe : హెల్తీగా ఉండాలి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునే వారు.. తమ రోజును ఓ అందమైన లడ్డూతో ప్రారంభించండి. అదేంటి లడ్డూలు ఆరోగ్యానికి మంచివి కాదు కదా అనుకుంటున్నారా? అయితే ఇవి సాధారణ లడ్డూలు కాదు. అవిగింజల లడ్డూలు. వీటిని తయారుచేయడం చాలా తేలిక. ఈ లడ్డూల్లోని పోషకాలు మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ

కావాల్సిన పదార్థాలు

* అవిసె గింజలు - 4 టేబుల్ స్పూన్లు

* బెల్లం - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)

* జీడిపప్పు - 100 గ్రాములు

* బాదం - 100 గ్రాములు

* ఎండు ద్రాక్ష - 1 టేబుల్ స్పూన్

* యాలకుల పొడి - అర టీస్పూన్

తయారీ విధానం

ముందుగా పాన్ తీసుకుని దానిలో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి.. పక్కన పెట్టండి. వాటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు అవిసెగింజలను దోరగా వేయించాలి. అవి కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టౌవ్ మీద పాన్ పెట్టి దానిలో బెల్లం వేసి.. అది కాస్త పాకంలాగా వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి.

ఆలోపు డ్రైఫ్రూట్స్, అవిసెగింజలను మిక్సీ చేయాలి. ఆ పిండిని.. ఈ బెల్లం పాకంలో వేసి స్టవ్ ఆపేయాలి. దానిలో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి సహాయంతో ఆ మిశ్రమాన్ని లడ్డూలు చేయాలి. అంతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే.. అవిగింజల లడ్డూలు రెడీ.

టాపిక్