తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Neem And Ginger Tea Recipe : రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి.. ఈ టీ తాగేయండి..

Neem and Ginger Tea Recipe : రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి.. ఈ టీ తాగేయండి..

07 October 2022, 7:02 IST

    • Neem and Ginger Tea Recipe : సీజన్ మారిపోతుంది. ఇప్పుడు వర్షాకాలానికి ముగింపులోనూ.. చలి కాలానికి ప్రారంభంలోనూ ఉన్నాం. ఈ సమయంలో చాలా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. అదే వేపతో తయారు చేసే టీ. 
వేపాకులతో చేసే టీ
వేపాకులతో చేసే టీ

వేపాకులతో చేసే టీ

Neem and Ginger Tea Recipe : సీజన్ ఏదైనా రోగనిరోధక శక్తి మాత్రం ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న పిల్లలనుంచి పెద్దల వరకు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడతారు కాబట్టి.. వారికి ఈ టీ ఇచ్చేయండి. అదేంటి టీ ఇవ్వండి అంటున్నారు అనుకున్నారా? అది నిజంగా టీ కాదులేండి. రోగనిరోధకశక్తిని పెంచే.. ఆయుర్వేద సుగుణాలు కలిగిన టీ. దీనిని షుగర్ ఉన్నా.. పిల్లలైనా.. పెద్దలైనా.. ఎవరైనా తాగవచ్చు. అదే వేపతో తయారు చేసిన అల్లం టీ. మరి దానిని ఎలా తయారు చేయాలి కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు చుద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

కావాల్సిన పదార్థాలు

* నీరు - 1 కప్పు

* వేపాకులు - 3-4

* నిమ్మరసం - అర టీస్పూన్

* అల్లం - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)

* తేనే - రుచికి తగినంత

తయారీ విధానం

ముందు గిన్నే తీసుకుని దానిలో నీరు, వేపాకులు (కడిగినవి), అల్లం వేసి స్టవ్ మీద పెట్టి 2 నుంచి 3 నిముషాలు ఉడకబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి.. ఓ కప్పులో వడపోసి.. నిమ్మరసం, తేనే వేసి బాగా కలపండి. దీనిని ఉదయాన్నే వేడి వేడిగా తాగితే.. ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా.. వేప, నిమ్మ, అల్లంలోని గుణాలు.. మీకు రోగనిరోధకశక్తిని పెంచి.. మిమ్మల్ని సీజనల్ డీసీస్​నుంచి కాపాడుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం