తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kashmiri Halwa Recipe : ఈ దసరా పండుగకి.. కశ్మీరీ హల్వా ఇలా చేసేయండి..

Kashmiri Halwa Recipe : ఈ దసరా పండుగకి.. కశ్మీరీ హల్వా ఇలా చేసేయండి..

05 October 2022, 8:15 IST

    • Kashmiri Halwa Recipe : పండుగ సమయంలో స్వీట్స్ చేసుకోవడం ఆనవాయితీ. అయితే స్వీట్స్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అని చెప్పవచ్చు. కానీ సింపుల్​గా, టేస్టీగా తయారు చేసుకోగలిగే అద్భుతమైన స్వీట్ రెసిపీ ఇక్కడ ఉంది. అదే కశ్మీరీ హల్వా. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
కశ్మీరీ హల్వా
కశ్మీరీ హల్వా

కశ్మీరీ హల్వా

Kashmiri Halwa Recipe : ఈరోజు దసరా పండుగా. తెలుగు రాష్ట్రాలు పండుగ వాతావరణంలో హడావిడిగా కళకళలాడిపోతున్నాయి. మరి ఈ సమయంలో పూజకోసం, మన కోసం కూడా ఓ చక్కని స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఈరోజు సింపుల్​గా, టేస్టీగా తయారు చేసుకోగలిగే కశ్మీరీ హల్వాను తయారు చేసుకుందాం. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కావాల్సిన పదార్థాలు..

* ఓట్స్ - 1 కప్పు

* పంచదార - అరకప్పు

* పాలు - 2 కప్పులు

* నెయ్యి - 4 టీస్పూన్స్

* ఏలకుల పొడి - 1 టీస్పూన్

* కుంకుమపువ్వు - కొంచెం

* జీడిపప్పు - మీ టేస్ట్​కి తగ్గట్లు

* బాదం పప్పు - మీ టేస్ట్​కి తగ్గట్లు

* ఎండుద్రాక్ష - మీ టేస్ట్​కి తగ్గట్లు

తయారీ విధానం

ముందుగా నాన్​ స్టిక్ పాన్ తీసుకోండి. దానిలో 2-3 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. దానిలో ఓట్స్ వేసి.. అవి రంగు మారే వరకు తక్కువ వేడి మీద ఫ్రై చేయండి.

ఇప్పుడు మరో పాన్​లో పాలు, పంచదార వేసి.. మరిగించండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత.. వేయించిన ఓట్స్ వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు దానిని కలుపుతూ ఉండాలి. కుంకుమపువ్వుని పాలల్లో నానబెట్టి.. ఆ మిశ్రమంలో వేసి.. బాగా కలపాలి. ఇప్పుడ స్టవ్ ఆపేసి.. దానిలో నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వేసి.. సర్వ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కశ్మీరీ హల్వా రెడీ.

టాపిక్

తదుపరి వ్యాసం