తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Bread Egg Upma Here Is The Making Process

Today Breakfast Recipe : Bread Egg Upma : ఈ హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ని చిటికెలో రెడీ చేసుకోవచ్చు..

08 July 2022, 7:05 IST

    • ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​లో రోటీన్ ఎగ్​కి, రోటీన్ ఉప్మాకి బాయ్ చెప్పాలనుకునే వారు ఈ బ్రెడ్ ఎగ్​ ఉప్మాని ట్రై చేయవచ్చు. పైగా దీనిని చేసుకోవడం చాలా సింపుల్ కూడా. జస్ట్ పది నిముషాల్లో టేస్టీ రెసిపీని మీరు పొందవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ బ్రెడ్ ఎగ్​ ఉప్మా
హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ బ్రెడ్ ఎగ్​ ఉప్మా

హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ బ్రెడ్ ఎగ్​ ఉప్మా

Recipe of the Day Bread Egg Upma : ఉదయాన్నే హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ తీసుకోవాలని అందరికి ఉంటుంది. అది కూడా ఎగ్​తో చేసిన రెసిపీ అయితే కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది. పైగా ఈ రెసిపీ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ సింపుల్ స్టెప్స్​తో బ్రెడ్ ఎగ్​ ఉప్మాను మీరు తయారు చేసుకోవచ్చు. ఇంతకీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Heart health and Diabetes : మధుమేహం ఉన్నవారు కార్డియాక్ అరెస్ట్‌ను ఎలా ఎదుర్కోవచ్చు?

Bank Account : చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా?

Curd Face Packs : వీటితో కలిపి పెరుగు ఫేస్ ప్యాక్ తయారుచేస్తే మీ ముఖం మెరిసిపోతుంది

Beetroot Palya Recipe : అన్నం, చపాతీలోకి బీట్‌రూట్ పల్యా రెసిపీ.. గట్టిగా లాగించేయెుచ్చు

బ్రెడ్ ఎగ్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు

* మినపప్పు - 1 స్పూన్

* కరివేపాకు - తాలింపునుకు సరిపడా

* పచ్చిమిర్చి - 2

* బ్రెడ్ - 4-5

* గుడ్డు - 1

* కారం - అరస్పూన్

* గరం మసాల - అర టీస్పూన్

* ఉప్పు - తగినంత

* మిరియాల పొడి - తగినంత

బ్రెడ్ ఎగ్ ఉప్మా తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి నూనె వేసి.. దానిలో మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకులను వేసి వేయించాలి. అనంతరం గుడ్డు వేసి బాగా కలిపి ఉడికించాలి. దానిలో కారం, గరం మసాల, ఉప్పు, మిరియాల పొడి వేసి మళ్లీ బాగా కలపాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న బ్రెడ్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. బాగా మిక్స్ అయిందని నిర్ధారించుకున్నాక.. కొత్తిమీర వేసి దించేయాలి. అంతే సింపుల్, ఈజీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.

టాపిక్