తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tasty Breakfast: గోల్డెన్ కాయిన్ ఎగ్ చిప్స్.. వర్షాకాలానికి బెస్ట్ బ్రేక్​ఫాస్ట్

Tasty Breakfast: గోల్డెన్ కాయిన్ ఎగ్ చిప్స్.. వర్షాకాలానికి బెస్ట్ బ్రేక్​ఫాస్ట్

07 July 2022, 7:01 IST

    • ఉదయాన్నే ఉడకబెట్టిన కోడిగుడ్లను తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే రోజూ గుడ్లను ఇలా తీసుకోవడం కష్టమే. కానీ కాస్త కొత్తగా ట్రై చేయాలనుకునే వారికి గోల్డెన్ కాయిన్ ఎగ్ చిప్స్ మంచి ఎంపిక. ఇంతకీ ఈ ఎగ్ చిప్స్ ఏంటి? దీనిని ఎలా తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.
గోల్డెన్ కాయిన్ ఎగ్స్ చిప్స్
గోల్డెన్ కాయిన్ ఎగ్స్ చిప్స్

గోల్డెన్ కాయిన్ ఎగ్స్ చిప్స్

Breakfast Recipes : రొటీన్ బ్రేక్​ఫాస్ట్​కు బాయ్ బాయ్ చెప్పి.. కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకునేవారికి ఈ రెసిపీ పక్కా నచ్చుతుంది. పైగా వానాకాలంలో ఉదయాన్నే ఏదైనా టేస్టీగా తినాలని అనిపిస్తుంది. ఈ సమయంలో కాస్త స్పైసీగా, టేస్టీగా తినాలని ఉంటుంది. ఇలాంటి క్రేవింగ్స్ ఉన్నవారు కచ్చితంగా గోల్డెన్ కాయిన్ ఎగ్ చిప్స్​ని టేస్ట్ చేయాల్సిందే. పైగా దీనిని తయారు చేయడానికి పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం కూడా లేదండోయ్. కొన్ని పదార్థాలు ఉంటే చాలు. వీటిని ఈజీగానే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మరీ వీటిని ఎలా తయారు చేసుకోవాలో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

కావాల్సిన పదార్థాలు

* ఉడకబెట్టిన గుడ్లు - 2 లేదా 3 (వీటిని చక్రాల వలె గుండ్రంగా ముక్కలు చేయాలి)

* ఉప్పు - రుచికి తగినంత

* అల్లం - 1 టీస్పూన్

* వెల్లుల్లి - 1 టీస్పూన్

* రెడ్ చిల్లీ ఫ్లేక్స్ - అర టీ స్పూన్

* డార్క్ సోయా సాస్ - 1 స్పూన్

* టొమాటో చిల్లీ కెచప్ - 1 స్పూన్

* మొక్కజొన్న పిండి - 2 స్పూన్స్

* నువ్వులు - 1 స్పూన్

* నూనె - ఫ్రైకి తగినంత

* వెన్న - 1 స్పూన్

గోల్డెన్ కాయిన్ ఎగ్స్ చిప్స్ తయారీ విధానం

ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలి. వాటిపైనున్న పెంకు తీసివేసి.. గుడ్లను గుండ్రంగా ముక్కలు చేసుకోవాలి. వాటిని మొక్కజొన్న పిండిలో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఓ పాన్ తీసుకుని దానిలో వెన్న వేయాలి. వేడి అయిన తర్వాత.. మొక్కజొన్న పూతతో ఉన్న గుడ్లను వేసి.. అవి రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

అనంతరం పాన్‌లో నూనె వేసి.. అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను వేసి.. ఉడికే వరకు వేయించాలి. చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేయాలి. నువ్వులను కూడా వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు వేసి.. ముందే రెడీ చేసుకున్న గుడ్లను ఈ మిశ్రమంలో వేయాలి. వీటిని బాగా కలపి.. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే.. టేస్టీ బ్రేక్ ఫాస్ట్ మీ సొంతం.

టాపిక్

తదుపరి వ్యాసం