తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation: ప్రపంచం గురించి తర్వాత.. ఇంతకీ మీ గురించి మీకు తెలుసా?

Thursday Motivation: ప్రపంచం గురించి తర్వాత.. ఇంతకీ మీ గురించి మీకు తెలుసా?

22 September 2022, 6:36 IST

    • Thursday Motivation: ప్రపంచంలో మనకి దేనిగురించి తెలియకపోయినా పర్లేదు. దాని గురించి తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఇతరులను అడగవచ్చు. ఇంకెక్కడో చదవుకోవచ్చు. కానీ అన్నింటి కన్నా ముఖ్యమైనది ఏమిటంటే.. మన గురించి మనకి తెలుసుకోవడం.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : ఓ మనిషి సక్సెస్ అయినా, నాశనం అయినా కీ రోల్ పోషించేది ఏమిటంటే.. తన గురించి తనకు తెలియకపోవడం. తను చేసిన తప్పుకైనా.. ఒప్పుకైనా.. తనే బాధ్యుడు. ఎవరో ఏదో అడ్డంకి సృష్టిస్తే ఓడిపోయామని సాకులు చెప్పడం కాదు. ఆ అడ్డంకులను ఎదుర్కొని ముందుగా సాగాగలిగే ఓర్పు అతనికుండాలి. దానికోసం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏమి చేస్తే బాగుంటాది. ఏమి చేయకూడదు అని. అంతేకానీ గుడ్డెద్దు వెళ్లి చెళ్లో పడిపోయినట్లుగా వెళ్తే ఏం లాభం.

చాలామంది తమ గురించి తాము తెలుసుకోవడం కన్నా.. ఇతరుల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. గుర్తుంచుకోవాల్సింది ఏమటింటే.. ఇతరుల గురించి ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఎలా అయినా తెలుసుకోవచ్చు. ముందు మీ గురించి ఆలోచించుకోండి. మీ సామర్థ్యాలు ఏమిటి? మీరు ఏమి చేయాలనుకుంటున్నారు. దానికోసం మీరు ఏమి చేస్తున్నారు. మీ ప్లస్​లు, మైనస్​లు ఇలా మీ గురించి ఆలోచించుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి.

ఇవి మీరు జీవితంలో ఏమి సాధించాలనుకున్నా.. ఉపయోగపడే అస్త్రాలు. మీ సామర్థ్యాలు మీకు తెలిసినప్పుడు మీరు ఎంత ప్రయత్నించాలో అర్థమవుతుంది. మీ కష్ట సమయాల్లో ఓదార్పునిస్తుంది. ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవడం మీద కాన్​సెంట్రేట్ చేస్తే లైఫ్​లో సక్సెస్ అవుతారు. కోచ్​లు మీ సామార్థ్యాలను వెలికి తీస్తారు. ఎందుకంటే అవి మీకు తెలియదు కాబట్టి. మీకే వాటి గురించి తెలుసు అనుకోండి మీకు కోచ్​ కూడా అవసరం లేదు. కోచ్​ మిమ్మల్ని గైడ్ చేస్తారు అంతే.. మీ సామర్థ్యాలు మీలో ఉండేవే. కాబట్టి వాటిని గుర్తించడం మీద శ్రద్ధ వహించండి. ఇతరులకు ఏమి కావాలి.. వాళ్లకోసం ఏమి చేయాలి వంటివికాకుండా.. మనకి ఏమి కావాలి.. మనం ఏమి చేస్తే బాగుంటుందనే ప్రశ్నలు కూడా మీలో మొదలవ్వాలి. అవే మిమ్మల్ని ఇతరులకు దగ్గర చేయవచ్చు కూడా.

మనం మొదట మనల్ని మనం తెలుసుకోవడం ప్రారంభిస్తే.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం నిజంగా తెలుసుకోగలం. జీవితం మనకు ముఖ్యమైన సవాళ్లను ఇస్తుంది కాబట్టి దృఢ సంకల్పంతో, సంకల్ప శక్తితో వాటిని ఎదుర్కొనేంత ధైర్యంగా ఉండాలి. మనుషులు తయారు చేసే ఏ ఆయుధం అయినా.. సంకల్ప శక్తి కన్నా గొప్పది కాదని గుర్తించుకోండి. దీని గురించి ప్రముఖ తత్వవేత్త, యుద్ధ కళాకారుడు బ్రూస్ లీ కూడా ఓ సందర్భంలో తెలిపారు.

ఏ వ్యక్తి అయినా జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన కోరికతో ఉంటే.. అతను లేదా ఆమె తన లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటే.. లక్ష్యం త్వరలోనే నెరవేరుతుంది. తనని తాను నమ్మినప్పుడు చుట్టూ పరిస్థితులు కూడా తనకి అనుకూలంగా మారతాయి. జ్ఞానవంతుడు అంటే శక్తిమంతుడు కాదు. ధైర్యం లేనివాడు. తన గురించి తనకి తెలియని వాడు. జీవితంలో ఓటమి లేదా విజయం ముఖ్యం కాదు. మనం దెబ్బతిన్న సరే.. మరోసారి ప్రయత్నించాలనే సంకల్పమే నిజమైన ధైర్యం.

టాపిక్