తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Emotional Health: ఎమోషనల్‌‌‌గా వీక్‌గా ఉన్నారా? అయితే ఇలా చేయండి

Emotional health: ఎమోషనల్‌‌‌గా వీక్‌గా ఉన్నారా? అయితే ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu

02 February 2023, 16:32 IST

    • Emotional health: మెంటల్ హెల్త్ పెంపొందించడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన కొన్ని విషయాలపై నిపుణుల సూచనలు ఇక్కడ ఉన్నాయి.
ఎమోషనల్ హెల్త్ బాగుండాలంటే ఇలా చేయండి
ఎమోషనల్ హెల్త్ బాగుండాలంటే ఇలా చేయండి (Designecologist)

ఎమోషనల్ హెల్త్ బాగుండాలంటే ఇలా చేయండి

ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మనకు ఆరోగ్యకరమైన మానసిక స్థితి కూడా అవసరం. సంతోషంగా, సంతృప్తిగా ఉండాలంటే మానసిక ప్రశాంతత అవసరం. మనం రోజంతా చేసే చిన్న చిన్న అభ్యాసాలతో ఇది సాధ్యమవుతుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మనం ఎక్కువసేపు గడిపే వ్యక్తులు, మనం నివసించే స్థలం, మన అలవాట్లు మానసిక ఆరోగ్యానికి చాలా దోహదపడతాయి. స్థిరమైన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి థెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ తన తాజా ఇన్‌స్టా పోస్టులో పలు సూచనలు చేశారు. 

ట్రెండింగ్ వార్తలు

Curd and Diabetes: రోజూ కప్పు పెరుగు తింటే డయాబెటిస్ మాత్రమే కాదు ఈ వ్యాధులను రాకుండా అడ్డుకోవచ్చు

Vankaya Pachadi: వంకాయ పచ్చడి రెసిపీ ఇదిగో, ఒక్కసారి తిన్నారంటే మరిచిపోలేరు

Visakha Trip: విహారానికి విశాఖపట్నం వెళ్తే ఈ ప్రకృతి ప్రాంతాలను చూడకుండా వెనక్కి రాకండి, చాలా మిస్ అవుతారు

Moringa Water for weightloss: ఖాళీపొట్టతో ఈ పానీయాన్ని తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు

నిర్ణయాలు: జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల మనలో ఒత్తిడి, ఆందోళన ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన భావోద్వేగ స్థితి కొనసాగాలంటే మనం అలసిపోయినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం నుండి విరామం తీసుకోవాలి.

భాగస్వామి: మన భావాలను పంచుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలి. వాటిని జడ్జ్ చేయడం కాకుండా ఓపికగా వినేవారు కావాలి. మనల్ని సౌకర్యవంతంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇలా ఉండడం అదృష్టం కూడా.

ప్రకృతి: ప్రకృతితో మమేకం అవ్వాలి. ప్రకృతి మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. మనస్సును శాంతపరచడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

విలువ: ప్రశంసలు మనకు విలువైన అనుభూతిని కలిగిస్తాయి. మన విలువను పెంచడానికి ఇవి తోడ్పడుతాయి.

క్రియేటివిటీ: మీ పనికి సంబంధం లేని అభిరుచిని కలిగి ఉండటం వల్ల సృజనాత్మకత చిగురిస్తుంది. అది మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.

అర్థం చేసుకోవడం: మనల్ని అర్థం చేసుకున్నారన్న భావన అన్ని రకాల ఒత్తిడిని అధిగమిస్తుంది. మనం కోరుకున్న విధంగా మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నారన్న భావన చాలా ముఖ్యం.

నవ్వు: కొద్దిసేపు ఆటలు, నవ్వులు కలిస్తే నయం చేయలేనిదంటూ ఏమీ లేదు. మనం తరచుగా దీనిని అలవరచుకోవాలి. దీంతో మన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.