తెలుగు న్యూస్  /  Lifestyle  /  Things To Do When Offering An Apology Know From Therapist Here

Offering an apology: మీ స్వీట్‌హార్ట్‌తో గొడవా? క్షమాపణ చెప్పాలనుకుంటున్నారా?

HT Telugu Desk HT Telugu

24 March 2023, 14:41 IST

  • Offering an apology: మీ స్వీట్‌హార్ట్‌తో గొడవ పడ్డారా? క్షమాపణ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఈ థెరపిస్ట్ సూచనలు అనుసరించండి.

క్షమాపణలు చెప్పబోయే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు
క్షమాపణలు చెప్పబోయే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు (Unsplash)

క్షమాపణలు చెప్పబోయే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు

ఒక రిలేషన్‌షిప్ కొనసాగాలంటే ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి. అవసరమైనప్పుడు రాజీపడాలి. నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు జరగాలి. ఆరోగ్యకరమైన రిలేషన్‌షిప్ అయితే ఇరువైపులా అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇద్దరూ ఉమ్మడిగా, వ్యక్తిగతంగా వృద్ధి చెందడానికి ఇద్దరి మధ్య సురక్షితమైన స్పేస్ కోసం ఉండాలి. 

మనం అనుకున్నట్టుగా నిజానికి గొడవలు అనారోగ్యకరమైనవేం కావు. అవి అవతలి వ్యక్తి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఒక సందర్భంలో తలెత్తే భేదాభిప్రాయాన్ని అంగీకరించడం కొన్నిసార్లు ఆరోగ్యకరమైన మార్గం అవుతుంది. ఈ అంశాలను సైకోథెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ చర్చించారు. ‘నిజాయతీగా క్షమాపణలు కొన్ని పనులు ఉంటాయి. మీరు క్షమాపణ చెప్పిన ప్రతిసారి అన్ని దశలూ రెలవెంట్‌గా ఉండవు. ఆరోగ్యకరమైన సంబంధాలు అంటే అసలు ఎన్నటికీ బాధపడడం, గొడవపడడం జరగకపోవడం కాదు. ఆరోగ్యకరమైన రిలేషన్‌షిప్స్ అంటే బాధను, గొడవను ఎలా హాండిల్ చేయాలో తెలుసుకోవడం..’ అని వివరించారు.

ఇద్దరి మధ్య సంఘర్షణను నిజాయతీతో కూడిన క్షమాపణల ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చో ఎమిలీ వివరించారు. మీ భాగస్వామికి మీరు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నటయితే కొన్ని విషయాలను మీరు గుర్తుంచుకోవాలి.

కాస్త స్పేస్ ఇవ్వండి: సంఘర్షణ తరువాత వారు ఎలా ఫీల్ అయ్యారో ఎక్స్‌ప్రెస్ చేసేందుకు మీ భాగస్వామికి కాస్త స్పేస్ ఇవ్వండి. వారు తమ భావాలను వ్యక్తం చేసి ఉపశమనం పొందిన తరువాత మీరు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పగలగాలి.

మీరు ఎలా అర్థం చేసుకున్నారో చెప్పండి: వారు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించాక, మీరు కూడా ఆ సిచ్యుయేషన్‌ను మీరు ఎలా అర్థం చేసుకున్నారు.. మీ చర్యలు వారిని ఎలా గాయపరిచాయో చెప్పాలి. ఆ తరువాత మీరు క్షమాపణలు కోరండి.

బాధ్యత వహించండి: తప్పులు చేసినప్పుడు వాటికి బాధ్యత వహించడం చాలా ముఖ్యం. ఆ సందర్భం వారిని ఎలా గాయపరిచిందో గమనించి దానికి మీరే బాధ్యత తీసుకోవాలి.

ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పాలి: మీరు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పేందుకు మీరు ఆ సిచుయేషన్‌లో మీ దృక్కోణం ఏంటి? ఏ సందర్భంలో అలా చేయాల్సి వచ్చిందో చెప్పొచ్చు.

మీ ఉద్దేశం చెప్పండి: క్షమాపణ చెప్పడంలో ఉద్దేశం మీ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. భవిష్యత్తులో అది పునరావృతం కాకుండా చూడాలి.

సమయం ఇవ్వండి: క్షమాపణలు చెప్పాక, వారు ఆ గాయం నుంచి కోలుకునేంతవరకు కాస్త సమయం ఇవ్వండి.