తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rose Plants Care In Summer । వేసవిలో గులాబీ మొక్కలను ఇలా సంరక్షించండి!

Rose Plants Care in Summer । వేసవిలో గులాబీ మొక్కలను ఇలా సంరక్షించండి!

HT Telugu Desk HT Telugu

23 May 2023, 17:05 IST

    • Rose Plants Care in Summer: వేసవిలో గులాబీ మొక్కలను ఎలా సంరక్షించుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటితో మీ గులాబీ తోట గుబాళిస్తుంది.
Rose Plants Care in Summer:
Rose Plants Care in Summer: (Unsplash)

Rose Plants Care in Summer:

Rose Plants Care in Summer: గార్డెనింగ్ అనేది ఒక చాలా మందికి ఒక సరదా కాలక్షేపం. తమ టెర్రస్ లేదా బాల్కనీలో మొక్కలు నాటుకోవాలనే అభిరుచి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా వివిధ రంగుల్లో ఉండే గులాబీ మొక్కలు ఉండాలని కోరుకుంటారు. మీరు కూడా గులాబీ ప్రేమికులు అయితే ఈ వేసవిలో గులాబీ మొక్కలను ఎలా సంరక్షించుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటితో మీ గులాబీ తోట గుబాళిస్తుంది.

గుడ్డు పెంకులను ఉపయోగించండి

గుడ్డు పెంకులను కడిగి ఎండబెట్టి, వాటిని పొడిగా రుబ్బుకోవాలి. దీనిని జాగ్రత్తగా నిల్వచేసుకోవాలి. ఈ పొడిని మీ గులాబీ మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. గులాబీ పెంకుల పొడిని ఒక చెంచా పరిమాణంలో తీసుకొని మట్టిలో కలపండి. మీరు ప్రతి నెల గులాబీ మట్టిలో ఒక చెంచా కలపాలి. ఇది మట్టిలో కాల్షియం లోపాన్ని తొలగిస్తుంది, తద్వారా మొక్కకు మంచి పోషణ అంది ఎక్కువ సంఖ్యలో గులాబీలు వికసించడం ప్రారంభిస్తాయి.

కాఫీ పొడి వాడవచ్చు

గులాబీలకు కాఫీ చాలా ముఖ్యమైన ఎరువు. ఇది మొక్కలలో నత్రజని లోపాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం 1 టీస్పూన్ కాఫీ పొడిని మట్టిలో కలిపాలి. 15 రోజుల వ్యవధిలో ఒకసారి ఇలా చేస్తే వేసవిలో గులాబీ మొక్కలను కాపాడుకోవచ్చు.

ఉల్లిపాయ నీరు

ఒక కప్పులో ఉల్లిపాయ తొక్కలు, నీరు కలపండి ఇలా మూడు రోజులు ఉంచండి. తర్వాత దానిని వడపోసి ఆ నీటిని గులాబీ వేరులో వేయాలి. ఇది వేసవిలో గులాబీ మొక్కలకు హైడ్రేషన్ తో పాటు మొక్కకు అవసరమయ్యే మూలకాలను అందిస్తుంది. గులాబీలు పుష్పించడం ప్రారంభిస్తాయి.

ఆవు పేడను వేయండి

ఏ మొక్కకైనా ఆవు పేడ చాలా ముఖ్యమైన ఎరువు. గులాబీ మొక్కలకు ఎండిన ఆవు పేడ ఎరువును వేరుకు తగిలేటట్లు వేసి మట్టితో కప్పి నీరు పోయాలి. మొక్క వేగంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. చీడపీడలు కూడా ప్రభావితం చేయవు. కొద్ది రోజుల్లోనే మొగ్గలు కూడా రావడం ప్రారంభమవుతుంది.

సారవంతమైన మట్టిని కలపండి

మీరు గులాబీ మొక్క కోసం 5 నుండి 8 pH కలిగిన సారవంతమైన మట్టిని ఉపయోగించండి. అది మొక్క ఆరోగ్యంగా పెరిగేలా చేసి మంచి వికసించే పువ్వులను అందిస్తుంది. వేసవిలో మండే వేడిలో మొక్కను ఆరోగ్యంగా ఉంచడానికి ఆవు పేడ, వెచ్చని కంపోస్ట్, కోకోపీట్, వదులుగా ఉండే మట్టిని నేలలో కలపండి.

టాపిక్