తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rose Tea Health Benefits । గులాబీ చాయ్ తాగితే, ప్రయోజనాలే వేరోయ్.. రోజ్ టీని ఇలా చేయండి!

Rose Tea Health benefits । గులాబీ చాయ్ తాగితే, ప్రయోజనాలే వేరోయ్.. రోజ్ టీని ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu

20 May 2023, 18:21 IST

google News
    • Rose Tea Health benefits: సాధారణ తేయాకు ఆకులతో పాటు కొన్ని ఎండిన గులాబీ రేకులను జోడించడం వల్ల ఆ టీకి మధురమైన పూల రుచి, వాసన వస్తుంది. రోజ్ టీ తాగటం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందులో కొన్ని ఇక్కడ చూడండి.
Rose Tea Health benefits
Rose Tea Health benefits (Unsplash)

Rose Tea Health benefits

Roase Tea: గులాబీ పూలను శతాబ్దాలుగా హెర్బల్ మెడిసిన్‌లో ఉపయోగిస్తూ వస్తున్నారు. గులాబీ రేకులను వివిధ ఆహార పదార్థాలలో కలుపుతారు. అవి రంగు ఫేవర్ మాత్రమే కాకుండా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గులాబీ రేకులతో టీ కూడా కాచుకోవచ్చు. గ్రీన్ టీ, వైట్ టీ వలె రోజ్ టీ కూడా హెర్బల్ టీల జాబితాలో ఉంటుంది.

సాధారణ తేయాకు ఆకులతో పాటు కొన్ని ఎండిన గులాబీ రేకులను జోడించడం వల్ల ఆ టీకి మధురమైన పూల రుచి, వాసన వస్తుంది. రోజ్ టీ తాగటం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందులో కొన్ని ఇక్కడ చూడండి.

Rose Tea Health benefits - రోజ్ టీ తాగటం వలన ప్రయోజనాలు

  • ఒక కప్పు రోజ్ టీ ఒత్తిడి, ఆందోళనలను తగ్గించగలదు. గులాబీ రేకులు విశ్రాంతిని ప్రభావాలను కలిగిస్తాయని, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో, నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • కొన్ని ప్రాంతాలలో గులాబీ రేకులను జీర్ణశక్తికి ఔషధంగా ఉపయోగిస్తారు. గులాబీ రేకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని తేలింది. టీగా తీసుకుంటే, గులాబీ రేకులు తేలికపాటి భేదిమందు ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
  • పీరియడ్స్ నొప్పితో బాధపడే స్త్రీలు రోజ్ టీ తాగినప్పుడు ఓదార్పు ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి, ఇది పెయిన్ కిల్లర్స్ లేదా ఇతర ఓవర్ ది కౌంటర్ మెడిసిన్‌లకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
  • గులాబీ రేకులలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడానికి, శరీరంలో కణాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడానికి కూడా ఇవి సహాయపడతాయి.
  • గులాబీ రేకుల్లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి, ఇవి హానికరమైన బ్యాక్టీరియా నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. ఒక కప్పు రోజ్ టీ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  • రోజ్ ఫ్లవర్ సారం కూడా మంటను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. మీరు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ల్ఫమేటరీ పరిస్థితులతో బాధపడుతున్నా లేదా తాత్కాలిక నొప్పిని తగ్గించడానికి రోజ్ టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.
  • గులాబీ రేకుల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం నుండి శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడటం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
  • రోజ్ టీ తాగడం వల్ల మీ హైడ్రేషన్ మెరుగుపడుతుంది, ఇది మీ చర్మానికి ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. వృద్ధాప్య సంకేతాలను దూరం చేయగలదు.

Rose Tea Recipe

  • టీ పొడి - 4 tsp
  • నీరు - 1 కప్పు లేదా 1 గ్లాసు
  • పాలు - ¾ కప్పు
  • చక్కెర - 1 టేబుల్ స్పూన్
  • రోజ్ సిరప్ - 3 టేబుల్ స్పూన్లు
  • గులాబీ రేకులు - 1 టేబుల్ స్పూన్

గులాబీ చాయ్ ఎలా చేయాలి?

- ఒక పాత్రలో నీటిని మరిగించి, టీ పొడిని వేయండి.

- పాలు, రోజ్ సిరప్ వేసి మరిగించాలి.

- తర్వాత వడగట్టి సర్వింగ్ గ్లాస్‌లో పోసి, పంచదార వేసి బాగా కలపాలి.

లేదా నీటిలో డికాక్షన్ మరిగించి అందులోనే ఎండు గులాబీ రేకులు వేసి కాచి వడకడితే రోజ్ టీ రెడీ.

మీకు తెలుసా? ప్రతీ ఏడాది మే21న అంతర్జాతీయ టీ దినోత్సవం (International Tea Day)గా నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం