Salt Tea । టీలో చక్కెరకు బదులు ఉప్పు వేసుకొని తాగండి.. దీని ఆరోగ్య ప్రయోజనాలే వేరండి!-ever tried salt tea cut sugar and add little salt in your chai to get amazing health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Ever Tried Salt Tea? Cut Sugar And Add Little Salt In Your Chai To Get Amazing Health Benefits

Salt Tea । టీలో చక్కెరకు బదులు ఉప్పు వేసుకొని తాగండి.. దీని ఆరోగ్య ప్రయోజనాలే వేరండి!

Salt Tea Health Benefits
Salt Tea Health Benefits (Unsplash)

Salt Tea Health Benefits: మీరు తాగే టీలో ఉప్పుందా? లేకపోతే ఓ చిటికెడు ఉప్పు వేసుకొని తాగండి. టేస్ట్ ఎలా ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాలలో ఈ టీ బెస్ట్ అని అంటున్నారు.

Salt Tea: టీ అనేది మన జీవనశైలిలో విడదీయలేని భాగం. ఉదయం వేళ దినచర్యను ప్రారంభించటానికి, సాయంత్రం వేళ కాస్త రిలాక్స్ అవ్వడానికి ఒక కప్పు టీ మనకు ఇంధనం లాంటిది. అయితే ఈ టీలో ఎన్ని ఫ్లేవర్లు ఉన్నప్పటికీ మనం రోజూ తాగే టీ తియ్యగానే ఉంటుంది. మధుమేహం ఉన్నవారు చక్కెర లేకుండా చప్పగా తాగుతారు. కానీ మీరు ఎప్పుడైనా సాల్ట్ టీని ప్రయత్నించారా? అసలు టీలో ఉప్పు కలిపి తీసుకోవచ్చని మీకు తెలుసా? కానీ టీలో చక్కెరకు బదులు చిటికెడు ఉప్పు కలుపుకొని తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయట. అయితే సాధారణ ఉప్పుకు బదులు బ్లాక్ సాల్ట్ లేదా హిమాలయన్ ఉప్పు కలిపి తాగితే మంచిదని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

How To Make Salt Tea- సాల్ట్ టీ ఎలా చేయాలి?

సాల్ట్ టీ చేయడానికి, మీరు చేయాల్సిందల్లా ముందుగా టీ ఆకులను లేదా టీ పొడిని నీటిలో వేసి మరిగించండి, మరిగిన డికాక్షన్ ను కప్పులో పోసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తాగటమే. మీరు పాలు కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు. డికాక్షన్ లో పాలు కలిపిన తర్వాత చిటికెడు ఉప్పువేసి కలుపుకొని తాగాలి. సాల్ట్ టీలో చక్కెర వేయకూడదు.

Salt Tea Health Benefits- ఉప్పు చాయ్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  1. ఉప్పు టీ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఉప్పు టీ గొంతు నొప్పిని కూడా నయం చేస్తుంది, సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది.
  2. చాయ్ లో చిటికెడు ఉప్పు కలిపి తాగటం వల్ల శరీరంలో శక్తితో పాటు సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. మీ జీర్ణవ్యవస్థను నియంత్రణలో ఉంచడం, జీవక్రియను మెరుగుపరిచే విషయంలో సాల్ట్ టీ అద్భుతాలు చేయగలదు.
  3. హిమాలయన్ సాల్ట్‌లో ఉండే జింక్ దెబ్బతిన్న కణజాలాలను రిపేర్ చేయడంలో, మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇందులోని సల్ఫర్ మూలకం చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
  4. ఉప్పు టీ మైగ్రేన్ సమస్యలను నయం చేస్తుంది , మనస్సుతో పాటు శరీరాన్ని కూడా రిలాక్స్ చేస్తుంది. అంతేకాకుండా, ఇది ఒత్తిడి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మెరుగైన ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ సాల్ట్ టీ మిమ్మల్ని ఎక్కువ కాలం హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
  5. గ్రీన్ టీలో బ్లాక్ సాల్ట్ కలిపి తాగడం వల్ల అజీర్ణం, అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలను తగ్గించుకోవచ్చు.
  6. లెమన్ టీలో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. ఈ టీ కడుపు జీవక్రియ రేటును పెంచుతుంది, ప్రేగు కదలికను వేగవంతం చేస్తుంది. దీంతో, మీరు ఏది తిన్నా త్వరగా జీర్ణం కావడం ప్రారంభమవుతుంది. ఈ టీ మీ కడుపుని క్లియర్ చేస్తుంది, శరీరం డిటాక్స్ చేస్తుంది.
  7. బ్లాక్ టీలో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి తాగటం వలన బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్‌లను ప్రోత్సహిస్తుంది, దీని కారణంగా ఆహారం వేగంగా జీర్ణమవుతుంది, కొవ్వు తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ సాయంత్రం వేళ మీ టీలో చక్కెరకు బదులు ఉప్పు వేయండి, ఉప్పు టీని సిప్ చేస్తూ ఆస్వాదించండి, మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.