Summer Fridge Water : ఎండ చంపేస్తోందయ్యా.. అని ఫ్రిజ్‌లోని నీరు తాగుతున్నారా?
07 April 2023, 12:45 IST
- Don't Drink Fridge Water : వేసవి వచ్చిందంటే రిఫ్రిజిరేటర్ నీటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఈ సీజన్‌లో జనాలు ఎక్కువగా చల్లటి నీటిని తాగడానికి ఇష్టపడతారు. కానీ రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం.
ఫ్రిజ్ వాటర్
వేసవిలో బయట నుంచి వచ్చినా.. ఇంట్లో కూర్చొన్నా.. చల్లని నీటిని(Cool Water) తాగడం అలవాటు. గొంతులోకి కూల్ వాటర్ వెళ్తుంటే.. హాయిగా అనిపిస్తుంది. కానీ అనారోగ్యాన్ని కూడా తెస్తుంది. వేసవి(Summer)లో రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ సులభంగా వ్యాధికి దారితీస్తుంది. మీ రోగనిరోధక శక్తి(Immunity)ని బలంగా ఉంచుకోవడానికి చల్లని నీటికి దూరంగా ఉండండి. ఎండలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చల్లని నీరు తాగకూడదు. ఇది గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్, జలుబు, ఫ్లూ వంటి సమస్యలను కలిగిస్తుంది.
చల్లటి నీరు(Cool Water) తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా బరువు పెరుగుతారు. నిజానికి, చల్లని నీరు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును పోనివ్వదు. దీంతో బరువు తగ్గడం(Weight Loss) కష్టమవుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల దంతాలు బలహీనపడతాయి. దీనివల్ల మీరు ఆహారం(Food) నమలడం లేదా ఏదైనా తాగడం కష్టమవుతుంది. సాధారణ ఉష్ణోగ్రత నీటిని మాత్రమే తాగడానికి ప్రయత్నించండి, తద్వారా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.
చల్లటి నీరు తాగడం వల్ల మీ హృదయ స్పందన రేటు తగ్గుతుంది. పదవ కపాల నాడి శరీరం యొక్క స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఇది హృదయ స్పందన రేటు తగ్గింపును నియంత్రిస్తుంది. చల్లటి నీరు ఈ నాడిని ఉత్తేజపరుస్తుంది. ఇది మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది.
నిజానికి కూల్ వాటర్ తాగడం.. ఏ సీజన్లోనూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కూల్ వాటర్(Cool Water) తాగితే శరీరం చేసే పని మారిపోతుంది. జీర్ణం చేసే పని కాకుండా.. చల్లని నీటిని వేడిగా మార్చే పనిలో పడిపోతుంది. దీంతో ఫుడ్ సరిగా జీర్ణం కాదు, పోషకాలు శరీరానికి అందవు. కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్(Gas Trouble) లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాదు.. చల్లని నీరు తాగితే.. తలనొప్పి, సైనస్ సమస్యలు ఎదుర్కొంటారు.
చల్లని నీరు తాగితే.. బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది. కొన్ని సెకన్లపాటు.. నరాలు చల్లపడి జివ్వుమని నొప్పి పుడుతుంది. ఇలా ఎక్కువగా కూల్ ఉన్న వాటర్ తాగితే.. బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థను కంట్రోల్ చేసే వాగస్ నాడి శరీరంలో మెడ దగ్గర ఉంటుంది. ఎక్కువగా కూల్ వాటర్ తాగితే.. నాడీ వ్యవస్థ చల్లపటి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గే అవకాశం ఉంది. కొంతమంది తిన్నాక వెంటనే.. చల్లని నీరు తాగుతారు. దీంతో శరీరంలోని కొవ్వు బయటకు పోదు. వేసవిలో ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది.