9 Brains and 3 Hearts : 9 మెదళ్లు, 3 హృదయాలు.. మీకు తెలియని విషయం ఇది
9 Brains and 3 Hearts : సృష్టిలో ఎన్నో రహస్యాలు.. కొన్ని వింతగా ఉంటాయి. అవునా? నిజమా? అనిపించేలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఓ జీవికి 9 మెదళ్లు, 3 గుండెలు ఉంటాయని మీకు తెలుసా?
భూమి మీద ఎన్నో రకాల జీవులు. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. తెలుసుకుంటే.. ఇలాంటివి కూడా ఉంటాయా? అని నోరు తెరుస్తాం. ఎంత తెలుసుకున్నా.. ఇంకా సృష్టిలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. అలాంటిదే ఓ జీవికి 9 మెదడులు(9 Brains), మూడు గుండెలు(3 Hearts) ఉండటం. ఇక్కడ చెప్పేది ఏ జీవి గురించి అని మీరు ఊహించగలరా? ఆగండి.. ఆగండి.. కష్టపడకండి. ఆలోచిస్తూ.. తల గోక్కొవడం వద్దులేండి. అది మరేదో జీవి కాదు.. ఆక్టోపస్(octopus). అవును మనల్ని ఆశ్చర్యపరిచే.. ఈ జీవికి మూడు హృదయాలు, తొమ్మిది మెదడులు ఉన్నాయి.
పురాణాలు, మూఢనమ్మకాల ప్రకారం.. ఆక్టోపస్‌లను గ్రహాంతర జీవులుగా లేదా మహాసముద్రాల భయంకరమైన చీకటి లోతుల్లో నివసించే చెడు జీవులుగా అంటుంటారు. కానీ అవి కూడా సాధరణమైన ఓ జీవి. ఆక్టోపస్‌కు మూడు హృదయాలు, తొమ్మిది మెదళ్ళు, నీలిరంగు రక్తం ఉంటుంది.
ఈ జీవి రెండు హృదయాలు మొప్పల కోసం తయారై ఉంటాయి. రక్తాన్ని(Blood) పంప్ చేయడానికి ఉపయోగిస్తాయి. ఇది కాకుండా మధ్యలో మూడో గుండె ఉంది. ఇది రక్తంలో ఆక్సిజన్ పొందిన తర్వాత, మొత్తం శరీరానికి సరఫరా చేస్తుంది. తద్వారా మిగిలిన అవయవాలు బాగా పని చేస్తాయి.
అయితే ఆక్టోపస్ 9 మెదడులను ఎలా ఉపయోగిస్తుంది? వాస్తవానికి, దాని ఎనిమిది మెదడుల్లో ప్రతి ఒక్కటి చేయి కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇతర కార్యకలాపాలకు కేంద్రంగా ఒకటి పని చేస్తుంది. కేంద్ర మెదడు నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఎనిమిది చేతులలో ప్రతిదానిలో ఒక చిన్న మెదడు ఉంది. ఇది చేతులు ఒకదానికొకటి స్వతంత్రంగా పని చేయడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ ఒకే లక్ష్యంతో కలిసి పని చేస్తుంది ఆక్టోపస్(octopus).
ఆక్టోపస్‌లు విషపూరిత సిరాను ఉత్పత్తి చేసే గ్రంథులను కలిగి ఉంటాయి. అవి పెద్ద సంచులలో నిల్వ అయి ఉంటాయి. ఈ జీవి అప్రమత్తమైనప్పుడు, అది ఒక దిశలో శక్తివంతమైన జెట్‌లో సిరాను చిమ్ముతుంది. అదే సమయంలో జంతువును వ్యతిరేక దిశలో నడిపిస్తుంది. పారిపోతున్నప్పుడు గందరగోళానికి గురిచేయడానికి నీటిని మబ్బు చేస్తుంది.
ఆక్టోపస్ గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తల్లి ఆక్టోపస్(Mother octopus) లోతైన నీటి గుహలలో గుడ్లు పెట్టిన తర్వాత తమ ప్రాణాలను త్యాగం చేస్తాయి. గుడ్లతో ఏడు నెలల వరకు తినకుండా జీవిస్తాయి. ఆక్సిజన్(Oxygen), పోషకాలు అధికంగా ఉండే నీటి ప్రవాహాలు వాటిపైకి వచ్చేలా చూస్తాయి. తల్లులు సాధారణంగా తమ సంతానం కోసం పొదిగిన తర్వాత చనిపోతాయి.
ఆక్టోపస్ రక్తం నీలం రంగులో ఉంటుంది. మనకు ఎర్రటి రక్తం ఉంది. ఎందుకంటే అందులో హిమోగ్లోబిన్ అనే ఐరన్ ఆధారిత ప్రోటీన్ ఉంటుంది. కానీ ఆక్టోపస్ తన శరీరంలో హీమోసైనిన్ అని పిలువబడే ఒక రాగి ఆధారిత ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తం నీలం రంగులోకి మారుతుంది. హిమోగ్లోబిన్ చేసినంత సులభంగా హిమోసైనిన్ ఆక్సిజన్‌తో కలిసిపోదు. దీని కారణంగా, రెండు హృదయాలు మొప్పల ద్వారా రక్తాన్ని పంప్ చేస్తాయి. ఇవి ఆక్సిజన్, రక్తాన్ని పొందుతాయి. మూడో గుండె శరీరమంతా పంపుతుంది.
సంబంధిత కథనం
టాపిక్