Chicken Keema Recipe । సింపుల్‌గా చికెన్ కీమా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరమ్మా!
04 August 2024, 1:32 IST
- Chicken Keema Recipe: మటన్ కీమా రుచి ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. ఒకసారి చికెన్ కీమా తిని చూడండి. రెసిపీ ఇక్కడ ఉంది ఓసారి ప్రయత్నించండి.
Chicken Keema Recipe
సండే అయినా, మండే అయినా రోజూ తినాలనిపించే ఆహారమే మాంసాహారం. చికెన్, మటన్ మొదలుకొని అనేక రకాల సీఫుడ్‌తో ఎన్నో రకాల రుచికరమైన వెరైటీలు వండుకోవచ్చు. అయితే వీటిని వండటం కొంత శ్రమతో కూడుకొన్నది, సమయం ఎక్కువ తీసుకుంటుంది. మీరు త్వరగా ఏదైనా మాంసాహారం వండుకోవాలనుకుంటే చికెన్ కీమా ఎంతో రుచికరమైన ఛాయిస్.
సాధారణంగా మనం మటన్ కీమా ఎక్కువగా వండుకుంటాం, చికెన్‌తో కూరలు, స్టార్టర్స్ చేసుకుంటాం. అయితే ఈ చికెన్ కీమాలో తక్కువగా ఉంటుంది, తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది, ఆరోగ్యకరమైనది కూడా. చికెన్ కీమాతో మీరు అన్నం, చపాతీ, పరాటాలే కాకుండా స్నాక్స్ కూడా సిద్ధం చేసుకోవచ్చు. మరి సింపుల్‌గా, రుచికరంగా చికెన్ కీమా ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది. ఇక్కడ అందించిన సూచనల ప్రకారం సులభంగా చేసేయండి.
Chicken Keema Recipe కోసం కావలసినవి
- 300 గ్రాముల చికెన్ కీమా
- 1½ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
- 2 టమోటాలు
- 1/4 కప్పు టొమాటో ప్యూరీ
- 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 2 టేబుల్ స్పూన్లు పెరుగు
- 1-అంగుళం దాల్చిన చెక్క
- 1 బిరియానీ ఆకు
- 3- 4 ఏలకులు
- 4 - 5 మిరియాలు
- 4 నుండి 5 లవంగాలు
- 1 టీస్పూన్ కారం
- 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
- 1/2 టీస్పూన్ పసుపు
- ¼ టీస్పూన్ కసూరి మెంతి
- 1/2 కప్పు నూనె
- ఉప్పు - రుచికి తగినంత
- గార్నిష్ చేయడానికి కొత్తిమీర
చికెన్ కీమా తయారీ విధానం
- ముందుగా చికెన్ కీమాను బాగా శుభ్రపరిచి అనంతరం రుచికి తగినట్లుగా ఉప్పు, కారం, టొమాటో ప్యూరీ చేసి చేతులతో బాగా కలపాలి. దీనిని కాసేపు మేరినేట్ చేయడం కోసం పక్కనపెట్టండి.
- ఇప్పుడు కడాయిలో నూనె వేసి మీడియం వేడి మీద వేడి చేయండి. అనంతరం ఇందులో దాల్చిన చెక్క, ఏలకులు, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి.
- తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆపై అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- ఇప్పుడు టొమాటో ముక్కలు, మసాలా పొడులు అన్నీ వేసి, కొద్దిగా వేసి మెత్తగా అయ్యే వరకు బాగా వేయించాలి.
- అనంతరం మేరినేట్ చేసిన చికెన్ కీమాను వేసి వేయించాలి. కీమా నుండి నూనె బయటకు వచ్చే వరకు బాగా వేయించాలి.
- ఇప్పుడు కొన్ని వెచ్చని నీటిని, అవసరం అనుకుంటే పెరుగును చేసి బాగా కలపండి. ఆపైన మూతపెట్టి సుమారు 5-6 నిమిషాలు ఉడికించాలి.
చివరగా మూత తేసి తాజా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన చికెన్ కీమా రెడీ.